iDreamPost

అనవసరంగా అనిరుధ్​ వెంట పడుతున్నారు.. టాలీవుడ్​లో అతను ఉన్నాడుగా!

  • Author singhj Published - 05:35 PM, Sat - 4 November 23

కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్​ రవిచంద్రన్​ వెంట పడుతున్నారు టాలీవుడ్ మేకర్స్. తమ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తే పక్కా హిట్ అని భావిస్తున్నారు. అయితే మనకూ ఓ అనిరుధ్ ఉన్నాడని మాత్రం గుర్తించట్లేదు.

కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్​ రవిచంద్రన్​ వెంట పడుతున్నారు టాలీవుడ్ మేకర్స్. తమ సినిమాలకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తే పక్కా హిట్ అని భావిస్తున్నారు. అయితే మనకూ ఓ అనిరుధ్ ఉన్నాడని మాత్రం గుర్తించట్లేదు.

  • Author singhj Published - 05:35 PM, Sat - 4 November 23
అనవసరంగా అనిరుధ్​ వెంట పడుతున్నారు.. టాలీవుడ్​లో అతను ఉన్నాడుగా!

‘పొరుగింటి పుల్లకూర రుచి’ అనే సామెత వినే ఉంటారు. ఇది టాలీవుడ్​కు వర్తిస్తుందని చెప్పొచ్చు. యాక్టింగ్ నుంచి టెక్నీషియన్స్ వరకు ఇక్కడ ఎంతో టాలెంట్ ఉన్నా ఇతర ఇండస్ట్రీల వాళ్లే బెస్ట్ అంటూ ఏరికోరి తెచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇదీ మరీ ఎక్కువనే చెప్పాలి. అందం, అభినయంలో అదరగొట్టే అమ్మాయిలు ఇక్కడ చాలా మందే ఉన్నా.. మన మేకర్స్ ఫోకస్ అంతా కోలీవుడ్, శాండల్​వుడ్, మాలీవుడ్ మీదే. నార్త్ నుంచి కూడా అప్పుడప్పుడు హీరోయిన్లను దింపుతుంటారు. టెక్నీషియన్స్ విషయంలోనూ లోకల్ టాలెంట్​ను కాకుండా ఇతర పరిశ్రమల వారిని ఎక్కువగా ఎంకరేజ్ చేయడంపై పలుమార్లు విమర్శలు రావడం గమనించే ఉంటారు.

ఇతర ఇండస్ట్రీల నుంచి బెస్ట్ టెక్నీషియన్స్​ను, యాక్టర్స్​ను తెచ్చుకోవడంలో తప్పు లేదు. సినిమా అనేది విశ్వవ్యాప్తం కాబట్టి ఒక పరిశ్రమకు చెందిన వారు మరో పరిశ్రమలో నటించడం, గుర్తింపు తెచ్చుకోవడం అనేది మంచిదే. కానీ స్థానికంగా ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ పొరుగింటి పుల్లకూరే రుచి అన్న చందాన పరాయి ఇండస్ట్రీల వాళ్లపై అతిగా ఆధారపడటం, వాళ్ల కోసం వెంపర్లాడటం, డేట్స్ కోసం క్యూ కట్టడం కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కోసం తెలుగు మేకర్స్ మరీ ఎక్కువగా ప్రయత్నించడం, ఆయనే కావాలంటూ పట్టుబట్టడం విమర్శలకు దారితీస్తోంది.

అనిరుధ్ ఎంత టాలెంటెడ్ అనేది స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. ఆయన మ్యూజిక్ ఇస్తే సినిమాకు బిగ్ ప్లస్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన మ్యూజిక్ స్ట్రెంగ్త్​తో రజినీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘లియో’ సినిమాలను నిలబెట్టాడు అనిరుధ్. యావరేజీగా మిగిలిపోవాల్సిన ఈ రెండు మూవీస్ సూపర్​హిట్లుగా నిలవడంలో అనిరుధ్ రోల్​ ఎంతో కీలకమని చెప్పాలి. అలాంటి ఈ మ్యూజిక్ డైరెక్టర్ తమ మూవీస్​కు కూడా పనిచేయాలని టాలీవుడ్ మేకర్స్ అనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు.

టాలీవుడ్ మేకర్స్ అనిరుధ్​పై అతిగా డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదనిపిస్తోంది. లోకల్​గా ఉన్న వివేక్ సాగర్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్​లోని టాలెంట్​ను గుర్తించకపోవడం కాస్త బాధాకరమని విమర్శకులు కూడా అంటున్నారు. న్యూ ఏజ్​కు నచ్చేలా మ్యూజిక్ అందించడంలో వివేక్ సాగర్ ఆరితేరాడు. ‘పెళ్లిచూపులు’, ‘ఫలక్​నుమా దాస్’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘సమ్మోహనం’, ‘బ్రోచేవారెవరురా’, ‘హిట్’ లాంటి మ్యూజికల్ హిట్స్ అందించారాయన. మెలోడీ సాంగ్స్​తో పాటు సినిమా మూడ్​కు తగ్గట్లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించడంలో వివేక్ సిద్ధహస్తుడు.

వివేక్ సాగర్ బాణీలు అందించిన కొత్త మూవీ ‘కీడా కోలా’. తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వివేక్ సాగర్ మ్యూజిక్​పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సినిమాలోని పలు సీన్లు మామూలుగానే ఉన్నా వాటిని తన బీజీఎంతో లేపాడు వివేక్. ఒకరకంగా చెప్పాలంటే ‘కీడా కోలా’కు అతడి మ్యూజికే ప్రాణమని ప్రేక్షకులతో పాటు విమర్శకులూ ప్రశంసిస్తున్నారు. పర్ఫెక్ట్ స్క్రిప్ట్, కరెక్ట్ ఇన్​పుట్స్ ఇస్తే అనిరుధ్​ను మించిన మ్యూజిక్​ను అతడు ఇవ్వగలడని అంటున్నారు. మనకూ ఓ అనిరుధ్ ఉన్నాడని.. ఆయన్ని గుర్తించాలని కోరుతున్నారు. మరి.. వివేక్ సాగర్​ టాలెంట్​ను ఇప్పటికైనా మన మేకర్స్ గుర్తిస్తారో లేదో చూడాలి. వివేక్ సాగర్ మ్యూజిక్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి ప్రసిద్ధ్‌ కృష్ణ! బీసీసీఐపై ఫ్యాన్స్‌ ఫైర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి