iDreamPost

వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి ప్రసిద్ధ్‌ కృష్ణ! బీసీసీఐపై ఫ్యాన్స్‌ ఫైర్‌

  • Published Nov 04, 2023 | 4:28 PMUpdated Nov 04, 2023 | 4:28 PM

గాయంతో వరల్డ్‌ కప్‌ టోర్నీకి దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్థానంలో పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను ఎంపిక చేయడంపై విమర్శల వర్షం కురుస్తోంది. మరి ప్రసిద్ధ్‌ ఎంపికపై ఎందుకింత చర్చ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

గాయంతో వరల్డ్‌ కప్‌ టోర్నీకి దూరమైన ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్థానంలో పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను ఎంపిక చేయడంపై విమర్శల వర్షం కురుస్తోంది. మరి ప్రసిద్ధ్‌ ఎంపికపై ఎందుకింత చర్చ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 04, 2023 | 4:28 PMUpdated Nov 04, 2023 | 4:28 PM
వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి ప్రసిద్ధ్‌ కృష్ణ! బీసీసీఐపై ఫ్యాన్స్‌ ఫైర్‌

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో మంచి ప్రదర్శనతో దూసుకెళ్తున్న టీమిండియా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా గాయంతో ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీకి పూర్తిగా దూరం అయ్యాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఆడుతూ.. కాలితో బాల్‌ ఆపబోయిన పాండ్యా.. గాయంతో మ్యాచ్‌ ఆడటం లేదనే విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అధికారికంగా పాండ్యా టోర్నీకి దూరం అయినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా, పాండ్యా లేకుండా కూడా టీమిండియా అద్భుతంగానే రాణిస్తోంది. కానీ, బ్యాటింగ్‌లో కాస్త డెప్త్‌ తగ్గిందనే చెప్పాలి. ఐదురుగు నిఖార్సయిన బౌలర్లతో బరిలోకి దిగుతుండటంతో టీమిండియాకు కేవలం ఏడుగురు బ్యాటర్లే ఉంటున్నారు. పాండ్యా ఉంటే.. బౌలింగ్‌తో పాటు, బ్యాటింగ్‌లో కూడా టీమిండియా మరింత పటిష్టంగా ఉండేది.

అయితే.. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌లో పాండ్యాకు సైతం ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు కష్టంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు టీమ్‌లో ఉన్న 11 మంది ఆటగాళ్లు సైతం ఎంతో అద్భుతంగా రాణిస్తున్నారు. ఎవరినీ కూడా బెంచ్‌లో కూర్చోబెట్టేందుకు లేదు. అయినా కూడా పాండ్యా ఫిట్‌గా ఉంటే అతన్ని ఆడించాల్సిందే. కాగా, ఇప్పుడు పాండ్యా గాయంతో టోర్నీకి దూరం కావడంతో.. అతని స్థానంలో పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ రీప్లెస్‌మెంట్‌పై క్రికెట్‌ అభిమానులు అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జట్టులోని పేసర్లంతా సూపర్‌ ఫామ్‌లో ఉన్న సమయంలో మరో పేసర్‌ అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

రీప్లెస్‌మెంట్‌ను ఓ ఆల్‌రౌండర్‌తో చేయాల్సిందని సూచిస్తున్నారు. జట్టులో బౌలింగ్‌ అద్భుతంగా ఉందని, పైగా ఎవరీ కూడా రెస్ట్‌ ఇచ్చే అవకాశం సైతం లేదని, ఇస్తే గిస్తే.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బుమ్రాకి రెస్ట్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఎలాగే శార్దుల్‌ ఠాకూర్‌ రూపంలో మరో ఆల్‌రౌండర్‌ ఉన్నాడు. అతనితో పూర్తి కోటా బౌలింగ్‌ వేయించవచ్చు. అయినా కూడా మరో పేసర్‌ను బీసీసీఐ ఎందుకు రీప్లేస్‌ చేసిందో తమకు అర్థం కావడం లేదని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. కాగా, ప్రస్తుతం టీమ్‌లో ఉన్న పేసర్లు బుమ్రా, షమీ, సిరాజ్‌ ఎంత అద్భుతంగా బౌలింగ్‌ వేస్తున్నారో మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు వాళ్లు గాయాలపాలైతే తప్పా.. ప్రసిద్ధ్‌కు బరిలోకి దిగే అవకాశం రాదు. కనీసం వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకున్నా బాగుండేదని అంటున్నారు క్రికెట్‌ నిపుణులు మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి