iDreamPost

Animal: OTTలో మరో రికార్డు సాధించిన యానిమల్

  • Published Feb 12, 2024 | 4:31 PMUpdated Feb 12, 2024 | 4:31 PM

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన యానిమల్ మూవీ.. ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తూ.. దూసుకెళ్తోంది. తాజాగా మరో ఘనతను సాధించింది యానిమల్.

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించిన యానిమల్ మూవీ.. ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేస్తూ.. దూసుకెళ్తోంది. తాజాగా మరో ఘనతను సాధించింది యానిమల్.

  • Published Feb 12, 2024 | 4:31 PMUpdated Feb 12, 2024 | 4:31 PM
Animal: OTTలో మరో రికార్డు సాధించిన యానిమల్

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన తాజా చిత్రం యానిమల్.. కమర్షియల్ సక్సెస్ తో పాటు వివాదాలకి కూడా ప్రసిద్ధి చెందింది. నిజానికి ఒక వర్గం ప్రేక్షకులు, సెలబ్రిటీల నుంచి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాకుండా ఓటీటీలో మరి కొన్ని మైలురాళ్లను సాధించింది.

యానిమల్.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ నెట్‌ఫ్లిక్స్ లో అత్యధిక మంది వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచింది. నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్ కేటగిరీలో వరుసగా రెండు వారాల పాటు ప్లాట్‌ఫారమ్‌ గ్లోబల్ చార్టుల్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అదనంగా, ఈ చిత్రంతో పాటు విడుదలైన ఆల్బమ్, డీలక్స్ ఎడిషన్ గా ప్రేక్షకులకి అందించబడింది. స్పోటిఫైలో అత్యంత వేగంగా 500 మిలియన్లకు పైగా స్ట్రీమ్ లను సంపాదించిన భారతీయ ఆల్బమ్ గా కొత్త రికార్డును కూడా సృష్టించింది.

రణబీర్ కపూర్, అనిల్ కపూర్, తృప్తి దిమ్రి, రష్మిక మందన్న వంటి తారలు ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. తండ్రిపై కొడుకుకు ఉండే పిచ్చి ప్రేమ కథే యానిమల్. విజయ్ (రణబీర్) తన తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్)పై గాఢమైన ప్రేమ కలిగి ఉంటాడు. బల్బీర్ భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థని నడుపుతుంటాడు. చిన్నవయసులోనే తండ్రితో విభేదాల కారణంగా విజయ్ ను బోర్డింగ్ స్కూల్ కు పంపించేస్తాడు. ఆ తరువాత విజయ్ పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుతాడు. హత్యాయత్నం నుంచి బల్బీర్ ప్రాణాలతో బయటపడే వరకు ఆయనతో ఎలాంటి సంబంధాలు ఉండవు. విజయ్ ఇండియాకు తిరిగి వచ్చి శత్రువులపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది ప్రధాన కథాంశం. కాగా ఈ సినిమా సీక్వెల్ యానిమల్ పార్క్ చిత్రీకరణ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి యానిమల్ ఓటీటీలో సృష్టిస్తున్న రికార్డులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Ram Charan: ఫ్యాన్స్ కు పండగే.. #RC16 నుంచి కిక్కిచ్చే అప్డేట్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి