iDreamPost

రైతులకు AP ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్..

జగన్ సర్కార్ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ఆక్వా సాధికారి కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన ఆక్వా రైతులందరికి ఆ రోజు నుంచే లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు.

జగన్ సర్కార్ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ఆక్వా సాధికారి కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన ఆక్వా రైతులందరికి ఆ రోజు నుంచే లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు.

రైతులకు AP ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. వినూత్నమైన పథకాలు ప్రవేశపెడుతూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది జగన్ సర్కార్. విద్యార్థులకు, మహిళలకు, రైతులకు అన్ని వర్గాల వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఆక్వా రైతులను ఆదుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా జగన్ సర్కార్ ఆక్వా రైతులకు గుడ్ న్యూస్ అందించింది. అర్హులైన ఆక్వా రైతులందరికి విద్యుత్ సబ్బిడీ అందించాలని నిర్ణయించింది.

ఆక్వా రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. వారికి మరింత మేలు జరిగేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో ఆక్వా సాధికారికత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అర్హులైన ఆక్వా రైతులందరికి మార్చి 1వ తేదీ నుంచి విద్యుత్ సబ్సిడీని వర్తింపజేయాలని డిస్కమ్ లను ఆదేశిస్తూ తీర్మానం చేశారు. ఈ–ఫిష్‌ సర్వే ద్వారా ఆక్వా జోన్‌ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత పొందిన 3,467 విద్యుత్‌ కన్‌క్షన్లకు సబ్సిడీపై విద్యుత్ అందించనున్నారు.

ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్ ను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరావు, బొత్స సత్యనారాయణ, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. ఆక్వా రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు ఆక్వా ఉత్పత్తుల రేట్లను ఆర్బీకేల ద్వారా ప్రకటించడం వల్ల ఆక్వా రైతులకు లాభం చేకూరిందని వెల్లడించారు. వంద కౌంట్‌ రొయ్యలకు కేజీకి రూ.245 ధర ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తోందన్నారు. ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్ ను అందిస్తామని మంత్రులు చేసిన ప్రకటనపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి