iDreamPost

వీడియో: రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న AP శకటం!

75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలో కర్తవ్యపథ్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యా శకటానికి దేశం మొత్తం ఫిదా అయింది.

75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూఢిల్లీలో కర్తవ్యపథ్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యా శకటానికి దేశం మొత్తం ఫిదా అయింది.

వీడియో: రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆకట్టుకున్న AP శకటం!

దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగం వైభవంగా జరిగాయి. జాతీయ జెండాలు వాడవాడల రెపరెపలాడాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రిపబ్లిక్ డే వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఇతర కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఈ వేడుక పరేడ్ లో ప్రదర్శించిన శకటాలు అందరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఆంధ్రప్రదేశ్  శకటాన్ని ప్రదర్శించారు. ఏపీ విద్యా శకటానికి దేశం మొత్తం ఫిదా అయ్యింది.

సాధారణంగా ఏ ప్రభుత్వమైనా విద్యా రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదనే విషయం చాలా మందికి తెలిసిందే.  కానీ ఏపీ లో గత నాలుగున్నరేళ్లగా విద్యకు అత్యధిక ప్రాధాన్య ఇవ్వడమే గాక, ఖరీదైన ఇంటర్నేషనల్ బాకలారియెట్ వంటి సిలబస్ ను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సంకల్పించింది. ఈ కాలంలో రాష్ట్రంలో విద్యారంగం సమూలంగా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రతి పల్లెకు చేరువయ్యాయి. ఇలా పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిచడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ సంస్కరణలకు అద్దం పట్టేలా రిపబ్లిక్  డే దినోత్సవం వేడుకల్లో  విద్యా శకటాన్ని రూపొందించారు.

AP VISYA SAKATAM

ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలల విద్యను మార్చడం- విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా చేయడం” అనే ఇతివృత్తంతో ఏపీ శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు, వినూత్న పథకాలతో ప్రవేశపెట్టి కార్పొరేట్ స్కూల్స్ తో పోటీగా సర్కార్ బడులను అప్ గ్రేడ్ చేసింది.  విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. విద్యార్థులకు అహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఇలా ఏపీలో లో జరుగుతున్న విద్యా సంస్కరణలను అందరికి తెలియజేసేలా ఈ శకటాన్ని రూపొందించారు.

ఏపీ విద్యాకు సంబంధించిన 55 సెకన్ల నిడివిగ థీమ్ సాంగ్ తో ఈ శకటాన్ని ఢిల్లీ పరేడ్ లో ప్రదర్శించారు. ఇక విద్యార్థులతో నృత్యం చేయిస్తూ, విద్యా విలువను తెలియజేస్తూ..ఏపీ శకటం ముందుకు సాగింది. ఏపీ విద్యా శకటాన్ని చూసి దేశం మొత్తం ఫిదా అయింది. విదేశీయులు అయితే ఏకంగా క్లాప్స్ కూడా కొట్టారు. ప్రస్తుతం ఏపీ విద్యా శకటానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రదర్శించిన శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అయోధ్య రాముడు, చంద్రయాన్-3  శకటాలు అందర్నీ ఆకర్షించాయి. ఈవీఎంలో ఓటు వేస్తున్నట్లు రూపొందించిన శకటం ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెప్పింది. మరి.. ఢిల్లీ పరేడ్ లో ప్రదర్శించిన ఏపీ శకటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి