iDreamPost

ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఖాళీల భర్తీ కోసం..!

  • Author singhj Published - 05:06 PM, Fri - 28 July 23
  • Author singhj Published - 05:06 PM, Fri - 28 July 23
ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఖాళీల భర్తీ కోసం..!

ఆంధ్రప్రదేశ్​లో గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఏపీపీఎస్సీ మెంబర్ పరిగె సుధీర్ గౌడ్. గ్రూప్-2 ఖాళీల భర్తీ కోసం ఫైనాన్షియల్ క్లియరెన్స్ జరుగుతోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. ఇందుకు కృషి చేసిన ఏపీపీఎస్సీ ఛైర్మన్ డి.గౌతం సవాంగ్​తో పాటు సలాం బాబుకు ధన్యవాదాలు తెలిపారు సుధీర్ గౌడ్. ప్రస్తుత నియామక ప్రక్రియపై ప్రతిపాదిత జోనల్ వ్యవస్థ ఎలాంటి ప్రభావం చూపించదని ఆయన స్పష్టం చేశారు.

ఇకపోతే, ఆంధ్రప్రదేశ్​లో గ్రూప్​-2 రాత పరీక్షలకు సంబంధించి కొత్త సిలబస్ విడుదలైన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. మొత్తం 450 మార్కులకు గానూ రెండు దశల రాత పరీక్షల ద్వారా ఆంధ్రప్రదేశ్​ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అభ్యర్థులను ఎంపిక చేయనుంది. తొలి దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్.. అనంతరం రెండో దఫాలో 300 మార్కులకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్​ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్​ ఎగ్జామ్​కు అర్హులవుతారు. ప్రిలిమ్స్​లో ఈసారి కొత్తగా భారతీయ సమాజం అనే అంశాన్ని చేర్చారు.

ఏపీ గ్రూప్​-2కు సంబంధించి సవరించిన కొత్త సిలబస్, పరీక్షా విధానం ప్రకారం.. 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రంతో పాటు భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్​లో రెండు పేపర్లు ఉంటాయి. వాటిలో ఒక్కొక్కటి 150 మార్కులకు (మొత్తం 300 మార్కులు) ఉంటుంది. పేపర్​-1లో ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రశ్నలు అడగనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి