iDreamPost
android-app
ios-app

యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్.. అర్ధరాత్రి కాల్ చేసి నరకం చూపేవాడంటూ..!

Anchor Shyamala: రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు, సినిమా లవర్స్ కు యాంకర్ శ్యామలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈమె తన కెరీర్ కి సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Anchor Shyamala: రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు, సినిమా లవర్స్ కు యాంకర్ శ్యామలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఈమె తన కెరీర్ కి సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

యాంకర్ శ్యామల షాకింగ్ కామెంట్స్.. అర్ధరాత్రి కాల్ చేసి నరకం చూపేవాడంటూ..!

యాంకర్ శ్యామల.. ఈమె గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీరయల్స్ తో తన కెరీర్ ని మొదలు పెట్టి.. ఇప్పుడు యాంకర్ గా చేయడం మాత్రమే కాకుండా.. సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేస్తోంది. అయితే ఎవరికైనా, ఏ కెరీర్ ఎంచుకున్నా ప్రారంభంలో చాలానే ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంట వాటి గురించి అప్పుడు మాట్లాడలేకపోవచ్చు. కానీ, ఒకానొక టైమ్ లో ఓపెన్ అయిపోతారు. అలాగే శ్యామల కూడా ఇటీవల కొన్ని ఓపెన్ కామెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్ గురించి కూడా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

యాంకర్ శ్యామలకు తెలుగు ప్రేక్షకుల్లో చాలామంచి గుర్తింపు ఉంది. ఆమె సీరియల్స్ తో తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి యాంకర్ గా రాణిస్తోంది. అలాగే సినిమాల్లో కూడా ఛాన్సులు సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పుడంటే కెరీర్ ఇలా పరుగులు పెడుతూ ఆనందంగా సాగిపోతోంది. కానీ, కెరీర్ ప్రారంభంలో మాత్రం బిక్కుబిక్కుమంటూ బతికేవాళ్లం అంటూ యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. తాను నటిగా చేసేందుకు తల్లితో కలిసి హైదరాబాద్ కు వచ్చింది. అలా వచ్చిన కొత్తలో అవకాశాలు మాత్రమే కాకుండా కొన్ని వేధింపులు కూడా ఎదురైన విషయాన్ని శ్యామల బహిర్గతం చేసింది.

Symala

తనని షూటింగ్ లో కొంతమంది విసిగించేవారని చెప్పుకొచ్చింది. ఇంకొంతమంది తనతో మాట్లాడేందుకు ప్రయత్నించేవారంట. అలాగే చాలా మంది ప్రపోజ్ చేస్తూ వేధించేవారంట. అవన్నీ తట్టుకోలేక అసలు సీరియల్స్ మానేసి వెళ్లిపోవాలి అనుకుందంట. అంతేకాకుండా అదే సమయంలో ఒక కెమెరామ్యాన్ శ్యామలను బాగా ఇబ్బందులకు గురి చేశాడంట. అర్ధరాత్రి కాల్స్ చేసి వేధించేవాడంట. తనను యాక్సెప్ట్ చేయాలని ఇబ్బంది పెట్టేవాడంట. ఒకరోజు అయితే తన తల్లికి కాల్ చేశాడంటూ చెప్పుకొచ్చింది. “మీకు మగదిక్కు లేదు. నేను మిమ్మల్ని చూసుకుంటాను. నేను మీ అమ్మాయికి చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు. మీరైనా అర్థమయ్యేలా చెప్పండి” అంటూ బెదిరించాడంట.

ఆ సమయంలో తన తల్లి బెదిరిపోయినట్లు యాంకర్ శ్యామల చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తనకు ఏమైనా హాని తలపెడతాడేమో అని తన తల్లి భయపడిన విషయాన్ని వెల్లడించింది. అయితే తల్లికి తానే ధైర్యం చెప్పానంది. అప్పుడు అలా వేధింపులు, బెదిరింపులకు భయపడి వెనక్కి వెళ్లిపోయుంటే.. ఇప్పుడు యాంకర్ గా, యాక్టర్ గా శ్యామల రాణించేది కాదనే చెప్పాలి. లైఫ్ లో కొన్ని కావాలి అనుకుంటే కొన్నింటిని భరించాలి, ఎదురు తిరిగి పోరాడాల్సిందే అనే శ్యామల తన లైఫ్ ద్వారా ఒక చక్కని ఉదాహరణ ఇచ్చింది. ప్రస్తుతం అసలు యాంకర్ శ్యామలను అర్ధరాత్రి కాల్ చేసి.. వేధించింది ఎవరూ అంటూ బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారు. మరి. తనకు ఎదురైన వేధింపుల గురించి శ్యామల చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomtarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet