iDreamPost

తీవ్ర విషాదంలో యాంకర్‌ ఝాన్సీ.. అతడి మరణం తీరని లోటంటూ

  • Published Nov 08, 2023 | 11:11 AMUpdated Nov 08, 2023 | 11:11 AM

యాంకర్‌, నటి ఝాన్సీ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. జీవితం నీటి బుడగలాంటిది అని చెప్పుకొచ్చారు. ఇంతకు ఏం జరిగింది అంటే..

యాంకర్‌, నటి ఝాన్సీ సోషల్‌ మీడియాలో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. జీవితం నీటి బుడగలాంటిది అని చెప్పుకొచ్చారు. ఇంతకు ఏం జరిగింది అంటే..

  • Published Nov 08, 2023 | 11:11 AMUpdated Nov 08, 2023 | 11:11 AM
తీవ్ర విషాదంలో యాంకర్‌ ఝాన్సీ.. అతడి మరణం తీరని లోటంటూ

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్‌ అయినా.. చిన్న సెలబ్రిటీలు అయినా సరే.. మేనేజర్ల మీదనే ఆధారపడతారు. వారి డేట్స్‌, రెమ్యూనరేషన్‌, తారలకు సంబంధించిన ఏమైనా కీలక ప్రకటనలు చేయడం వంటి పనులన్నింటిని మేనేజర్లే చూసుకుంటారు. ఇక చాలా మంది స్టార్లు.. ఏళ్ల తరబడి ఒకే వ్యక్తిని మేనేజర్‌గా కొనసాగిస్తారు. తారలకు నమ్మకంగా ఉంటూ.. వారి కుటుంబ సభ్యులుగా కలిసి పోతారు. అయితే ఎక్కడో ఒక చోట మాత్రమే మోసాలకు పాల్పడే వారు ఉంటారు. చాలా వరకు.. స్టార్లకు నమ్మకంగా ఉండే మేనేజర్లే ఇండస్ట్రీలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా యాంకర్‌ తన మేనేజర్‌ గురించి చెబుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే..

యాంకర్‌ ఝాన్సీ మేనేజర్‌ మృతి చెందారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు ఝాన్సీ. ‘‘శ్రీను.. సీను బాబు.. అని ముద్దుగా పిలుస్తాను.. అతనే నా సపోర్ట్ సిస్టమ్.. హెయిర్ స్టైలిష్ట్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. కొన్నాళ్ల తర్వాత నా పర్సనల్ సెక్రటరీగా వచ్చాడు. ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి నా పనులన్నింటిని తనే చూసుకునేవాడు. అతడే నా రిలీఫ్.. నా బలం. నన్ను బ్యాలెన్స్‌గా ఉంచాడు.. చాలా మంచి వాడు.. ఎప్పుడు నవ్వుతూ.. నవ్విస్తూ ఉండేవాడు’’ అని చెప్పుకొచ్చింది.

‘‘అతను నా మేనేజర్‌ కన్నా.. నా కుటుంబ సభ్యుడు, సోదరుడిగా నా జీవితంలో ఉండిపోయాడు. ఎంతో మంచి వ్యక్తి అయిన మా సీను బాబు.. ఇలా 35 ఏళ్లకే అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు. దీనిపై ఎలా స్పందించాలో నాకు అర్థం కావడం లేదు. తన మరణం నాకు తీరని లోటు. జీవితం నీటి బుడగలాంటిది అన్నది మరోసారి అర్థం అయ్యింది’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఝాన్సీ.

ఇక ఝాన్సీ పోస్ట్ మీద పలువురు సెలబ్రిటీలు స్పందించారు. ఈ క్రమంలో యాంకర్ శిల్ప స్పందిస్తూ షాకింగ్‌గా ఉంది అని కామెంట్‌ చేయగా.. మీకు జరిగిన నష్టానికి సారీ, ఓం శాంతి అంటూ అడివి శేష్ కామెంట్ చేశాడు. సో స్యాడ్ అంటూ సురేఖా వాణి, ధైర్యంగా ఉండు అక్కా అని వింధ్యా విశాఖ.. ఓం శాంతి అంటూ ప్రగతి ఇలా చాలా మంది తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. అలానే గాయత్రీ దేవి, నందిని రెడ్డి వంటి వారు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

ఇక యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన ఝాన్సీ.. సినిమాల్లో కూడా నటిస్తోంది. సొంతం సినిమాలో సునీల్‌-ఝాన్సీల మధ్య వచ్చే కామెడీ సీన్లను నేటికి కూడా ప్రేక్షకులు మర్చిపోలేరు. ప్రస్తుతం ఝాన్సీ.. పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లలో నటిస్తూ.. బిజీగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by @anchor_jhansi

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి