iDreamPost
android-app
ios-app

ప్రియుడితో మరోసారి కెమెరా కంటపడిన హీరోయిన్! పిక్స్ వైరల్!

  • Author ajaykrishna Published - 04:43 PM, Thu - 13 July 23
  • Author ajaykrishna Published - 04:43 PM, Thu - 13 July 23
ప్రియుడితో మరోసారి కెమెరా కంటపడిన హీరోయిన్! పిక్స్ వైరల్!

ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్ మధ్య లవ్ అఫైర్స్ చాలా కామన్. ఎంత సీరియస్ గా ఏళ్లతరబడి డేటింగ్ చేసినా.. లవ్వాడుకున్నా ఎప్పుడు విడిపోతారో వాళ్లకే తెలియదు. ఇండస్ట్రీలో లవ్ స్టోరీలు అంత గొప్పగా నడుస్తుంటాయి. అలాగని అన్ని కాదు.. ఎక్కడో వందలో పది శాతం మాత్రమే లైఫ్ లాంగ్ కలిసి ఉండే ప్రేమలు. మిగతావన్నీ సంవత్సరాలకొద్దీ డేటింగ్స్, లవ్వాటలు ఆదుకోవడం.. తీరా పెళ్లి సమయానికి లేదా పెళ్ళి తర్వాత మాకు సెట్ అవ్వట్లేదు. మేం పార్ట్స్ గా విడిపోవాలని అనుకుంటున్నాం. దానికి మీ సపోర్ట్ మళ్లీ కావాలి.. మేం తిరిగి సింగల్స్ గా స్ట్రాంగ్ అవుతాం అన్నట్లుగా సాగుతున్నాయి.

ఇలాంటి టైంలో అసలు ఇండస్ట్రీలో ట్రూ లవ్ ఎక్కడ ఉంటుంది.. అంతా టైమ్ పాస్ లెక్కలే కదా అనే అభిప్రాయాలు జనాలకు వచ్చేసింది. అయినాసరే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఏ వుడ్ లోనైనా హీరోహీరోయిన్స్ మధ్య అఫైర్స్ ఆగడం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలోని స్టార్ కిడ్స్.. ఎగ్జామ్స్ లో పేపర్స్ తిరగేసినంత ఈజీగా రియల్ లైఫ్ లో బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తున్నారు. సరే అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యూటీ కూడా ఓ స్టార్ కిడ్. బాలీవుడ్ కి చెందినప్పటికి.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అదిగాక తెలుగు మూవీతోనే హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది.

ఎవరో గుర్తు పట్టారా.. ఆమె ఎవరో కాదు నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే. గతేడాది లైగర్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనన్య.. కెరీర్ పరంగా పెద్దగా ఊపులో లేదు. చేసిన సినిమాలేవి హిట్ తెచ్చి పెట్టలేదు. దీంతో ప్లాప్స్ లో ఉన్న ఈ భామ.. బిగ్ బ్రేక్ కోసం చాలా ట్రై చేస్తోంది. కానీ.. అనూహ్యంగా కెరీర్ లో కాకుండా లైఫ్ లో బిగ్ బ్రేక్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఎస్.. ఈ భామ ప్రెజెంట్ ‘ఆషికి 2’ ఫేమ్ ఆదిత్య రాయ్ కపూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బయటికి చెప్పట్లేదు కానీ.. వీరిద్దరూ ఇండియాలోనే కాదు. విదేశాలలో కూడా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. రీసెంట్ గా ఓ హీరోయిన్ ఇచ్చిన పార్టీకి ఆదిత్యతో కలిసి వెళ్లిన అనన్య.. తాజాగా స్పెయిన్ లో జరిగిన ఆర్కిటిక్ మంకీస్ కచేరీకి ఆదిత్యతో పాటు హాజరైంది. ఇంకేముంది వీరు లిస్బన్ లో దిగిన పిక్స్ లీక్ అయ్యాయి. దీంతో వీరి లవ్ అఫైర్ గుట్టు రట్టు అయ్యింది. మరి త్వరలో రిలేషన్ షిప్ పై ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom