iDreamPost

Aha Highway హైవే రిపోర్ట్

Aha Highway హైవే రిపోర్ట్

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ నటించిన కొత్త సినిమా హైవే ఇవాళ నేరుగా ఆహాలో ఓటిటి రిలీజ్ జరుపుకుంది. కళ్యాణ్ రామ్ తో 118 హిట్ ఇచ్చిన ప్రముఖ ఛాయాగ్రాహకులు కెవి గుహన్ దీనికి దర్శకత్వం వహించారు. ఆ మధ్య డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు అనే వెబ్ మూవీ కూడా చేశారు. ముందు థియేటర్లకు అనుకున్నప్పటికీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఇలాంటివి డిజిటల్ లోనే బాగా వెళ్తాయనే ఉద్దేశంతో నిర్ణయం మార్చుకున్నారు. ట్రైలర్ గట్రా ఆసక్తి రేగేలా ఉండటంతో ప్రేక్షకులు ఓ లుక్ వేద్దామని డిసైడ్ అయ్యారు. సైకో కిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన హైవేలో భారీ క్యాస్టింగ్ లేదు కానీ థ్రిల్లర్ లవర్స్ ని టార్గెట్ చేశారు. ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

విష్ణు(ఆనంద్ దేవరకొండ)ఓ ఫోటోగ్రాఫర్. ఓ షూట్ కోసం స్నేహితుడి(సత్య)తో కలిసి జీప్ లో లాంగ్ ట్రిప్ బయలుదేరతాడు. మరోవైపు హైదరాబాద్ నగరంలో అంతుచిక్కని రీతిలో టీనేజ్ అమ్మాయిలు దాస్(అభిషేక్ ముఖర్జీ)చేతిలో చంపబడుతూ ఉంటారు. అతని జాడ కోసం ఏసిపి(సయామీ ఖేర్)ఎంత ప్రయత్నించినా లాభం ఉండదు. ఇంట్లో సమస్యల వల్ల ఒంటరిగా మంగళూరుకు బస్సులో బయలుదేరుతుంది తులసి (మానస రాధాకృష్ణన్). అనుకోకుండా దాస్ కంట్లో పడుతుంది. అక్కడి నుంచి ప్రమాదంలో చిక్కుకున్న తనను కాపాడే బాధ్యత తీసుకుంటాడు విష్ణు. అసలు దాస్ మోటివ్ ఏంటి, ఎందుకిన్ని హత్యలు చేశాడు. ఎలా దొరికాడు అనేదే స్టోరీ.


మెయిన్ ప్లాట్ పరమ రొటీన్ లైన్ లో ఉండటం ఈ హైవేకున్న ప్రధాన మైనస్. విజువల్స్, లొకేషన్స్ బాగున్నప్పటికీ గుహన్ ఎంత సైకో కిల్లర్ బేక్డ్ డ్రాప్ అయినా దాన్ని వైవిధ్యంగా ప్రెజెంట్ చేయడంలో ఫెయిలయ్యారు. ఆడియన్స్ ఓటిటిలో ఇలాంటివి వందల్లో చూసుంటారనే అవగాహన లేకుండా స్క్రిప్ట్ రాసుకున్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో దాస్ ని అంతమొందించే ట్విస్టు ఏదో వెరైటీగా సెట్ చేశారు కానీ అదీ మిస్ ఫైర్ అయ్యింది. అక్కడక్కడా కొన్ని ఇంటరెస్టింగ్ మూమెంట్స్ తప్ప హైవేలో కంటెంట్ పరంగా చెప్పుకునే ప్రత్యేకత ఏమీ లేదు. అసలే ఇప్పుడిప్పుడే యాక్టింగ్ నేర్చుకుంటున్న ఆనంద్ కి ఇందులో స్కోప్ దొరకలేదు. పాతాల్ లోక్ వెబ్ సిరీస్ ద్వారా పరిచయమైన అభిషేక్ బెనర్జీ ఇందులోనూ భయపెట్టే లుక్స్ తో మెప్పించాడు. ఇది తప్ప ఇంకే అంశమూ ప్రత్యేకంగా అనిపించదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి