iDreamPost

OTTలో ఇలాంటి రొమాంటిక్ మూవీ మళ్ళీ రాదు! ఒక్కరే సీక్రెట్ గా చూసేయండి!

OTT Suggestions- Must Watch Movie: ఓటీటీలో మీరు చాలానే సినిమాలు చూసుంటారు. అయితే యాక్షన్, ఎమోషన్, డ్రామాలు చూసుంటారు. కానీ, రొమాంటిక్ డ్రామా అనగానే ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ, ఈ మూవీ ఒకసారి చూసేయండి.

OTT Suggestions- Must Watch Movie: ఓటీటీలో మీరు చాలానే సినిమాలు చూసుంటారు. అయితే యాక్షన్, ఎమోషన్, డ్రామాలు చూసుంటారు. కానీ, రొమాంటిక్ డ్రామా అనగానే ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ, ఈ మూవీ ఒకసారి చూసేయండి.

OTTలో ఇలాంటి రొమాంటిక్ మూవీ మళ్ళీ రాదు! ఒక్కరే సీక్రెట్ గా చూసేయండి!

రొమాంటిక్ సినిమాలు చూడాలి అంటే 1990స్ లో అయితే ఊర్లలో థియేటర్లలో వేసే సెకండ్ షోకి వెళ్లాలి. లేదంటే రొమాంటిక్ డ్రామాలు చూడాలి అంటే పక్కారుకి వెళ్లాలి. కానీ, ఇప్పుడు రోజులు మారిపోయాయి. అలాంటి రొమాంటిక్ థ్రిల్లర్స్, డ్రామాలు, సిరీస్లు చూడాలంటే జస్ట్ మీ చేతిలో ఫోన్ ఉంటే సరిపోతుంది. ఓటీటీల్లో రొమాన్స్ అనే కేటగిరీ పెట్టి మరీ అందులో మంచి మంచి రొమాంటిక్ డ్రామాలు, రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్స్, రొమాంటిక్ వెబ్ సిరీస్లను స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే వాటిలో కూడా ఎలాంటి మూవీ చూడాలి అని మీకు కాస్త కన్ఫూజన్ గా ఉంటే ఈ సజీషన్ ని ఫాలో అయిపోండి.

ఇప్పుడు చెప్పుకునే సినిమా కాస్త బోల్డ్ గానే ఉంటుంది. కానీ, చాలా మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ఇద్దరు కుర్రాళ్లు, ఇద్దరు అమ్మాయిల లైఫ్ లో జరిగే ట్విస్టులు, వారి మధ్య ఉన్న లవ్, రిలేషన్, వాళ్లు దాచే నిజాలు, చెప్పే అబద్ధాలు, చేసే తప్పులు, నేర్చుకున్న పాఠాలు నేపథ్యంలో ఈ మూవీ మొత్తం సాగుతూ ఉంటుంది. ఈ మూవీ పేరు 7 డేస్ 6 నైట్స్. ఇది ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. తెలుగు సినిమానే కాబట్టి మీరు ఎలాంటి భాషాభిప్రాయ బేధాలు లేకుండా చూసేయచ్చు. పైగా ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరో తెలుగు ప్రేక్షకులకు సుపరితుడే. అతను మరెవరో కాదు ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ ఎంఎస్ రాజు కుమారుడు సుమంత్ అశ్విన్.

సుమంత్ అశ్విన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎంతో మంచి ఫీల్ గుడ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అయితే కెరీర్ లో సరైన్ హిట్టు మాత్రం కొట్టలేకపోయాడు. అలాంటి సుమంత్ ని సక్సెస్ ట్రాక్ ఎక్కించడానికి కాస్త గ్యాప్ తర్వాత తండ్రి ఎంఎస్ రాజు రాసి, దర్శకత్వం వహించిన సినిమానే ఈ 7 డేస్ 6 నైట్స్ మూవీ. ఈ మూవీకి సుమంత్ అశ్విన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కూడా. కథ మీద ఉన్న మంచి నమ్మకంతోనే సుమంత్ అశ్విన్ నిర్మాత కూడా అయ్యాడు. అయితే ఈ మూవీని ఎంఎస్ రాజు కాస్త బోల్డ్ గానే చూపించారు.

ఇందులో కథ పరంగా మంచి మెసేజ్ ఉంది. మంచి లవ్ ఉంది. ఒక మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. కొంచ రొమాన్స్ కూడా ఉంది. అయితే తప్పుని తప్పు అని చెప్పాలి అంటే ముందు ఆ తప్పు ఏంటో చూపించాలి. ఆ క్రమంలో ఇలాంటి సినిమాల్లో కొన్ని సీన్స్ భాగం అవుతాయి. అయితే దీనికి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. 16+ వాళ్లు ఈ మూవీని చూడచ్చు. ఎంత ఓటీటీ అయినా కూడా సెన్సార్ సర్టిఫికేషన్ ఫాలో అయ్యి సినిమాలు చూస్తూ ఉంటే మంచిది. అలాగే మీరు ఇప్పటికే ఈ 7 డేస్ 6 నైట్స్ సినిమా గనుక చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి