iDreamPost

కేరళాలో లాటరీతో జాక్ పాట్ కొట్టిన అజ్ఞాత వ్యక్తి.. ఏకంగా రూ.20 కోట్లు..

అదృష్ట లక్ష్మి కొన్ని రూపాల్లో ఇంటి తలుపు తడుతుంది. కొంతమందికి ఆకస్మికంగా లంబెబిందెలు దొరకడం, కొంతమందికి లాటరీ రూపలో రాత్రికి రాత్రే లక్షాదికారి, కోటీశ్వరులు అయిన సందర్భాలు ఉన్నాయి.

అదృష్ట లక్ష్మి కొన్ని రూపాల్లో ఇంటి తలుపు తడుతుంది. కొంతమందికి ఆకస్మికంగా లంబెబిందెలు దొరకడం, కొంతమందికి లాటరీ రూపలో రాత్రికి రాత్రే లక్షాదికారి, కోటీశ్వరులు అయిన సందర్భాలు ఉన్నాయి.

కేరళాలో లాటరీతో జాక్ పాట్ కొట్టిన అజ్ఞాత వ్యక్తి.. ఏకంగా రూ.20 కోట్లు..

ఈ కాలంలో సొసైటీలో గౌరవంగా బతకాలంటే డబ్బు కావాలి.. కష్టపడి ఉద్యోగం, వ్యాపారం చేసుకొని జీవించే వారు కోట్లు సంపాదించడం కష్టం. అందుకే కొంతమంది అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని చూస్తుంటారు.. కానీ చట్టం చేతికి దొరికిపోతారు. కొంతమంది జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి.. అందుకు కారణం లాటరీ. తక్కువ సమయంలో లక్షాదికారి, కోటీశ్వరులు కావాలంటే ఒక్క లాటరీతోనే సాధ్యం అని చాలా మంది నిరూపించారు. అందుకే కొంతమంది తమ సంపాదనలో చాలా వరకు లాటరీల కోసమే వెచ్చిస్తుంటారు. కానీ కోట్ల మందిలో ఎవరికో ఒకరికి మాత్రమే లాటరీ రూపంలో అదృష్ట లక్ష్మి తలుపు తడుతుంది. తాజాగా ఓ అజ్ఞాత వ్యక్తి లాటరీ ద్వారా కోట్లకు అదిపతి అయ్యాడు. వివరాల్లోకి వెళితే..

క్రిస్మస్-కొత్త సంవత్సరం సందర్భంగా కేరళ లాటరీ డిపార్ట్ మెంట్ వారు ‘బంపర్ కేరళ’ లాటరీ నిర్వహించింది.. ఈ క్రమంలోనే విజేతలను ప్రకటించింది. తిరువనంతపురానికి చెందిన లక్ష్మీ లక్కీ సెంటర్ నిర్వాహకులు దురై రాజ్ ఇటీవల క్రిస్మస్ – నూతన సంవత్సరం పురస్కరించుకొని రూ.20 కోట్ల విన్నింగ్ టికెట్ ను ఓ వ్యక్తికి అమ్మాడు. అదృష్టం కొద్ది ఆ నంబర్ కే డ్రాలో జాక్ పాట్ తగిలినట్లు నిర్వాహకులు ప్రకటించారు. కాకపోతే ఆ టికెట్ ను ఎవరు కొన్నారన్న విషయంపై ఇంకా తెలియరాలేదు. ఆ వ్యక్తితో పాటు మరో 20 మందికి రెండో బహుమతిగా ఒక్కొక్కరికి రూ. కోటి చొప్పున గెలుచుకున్నారు. మూడవ బహుమతిగా 30 మందికి రూ.10 లక్షల చొప్పున గెలిచిన డబ్బు ఇస్తారు. కాగా, క్రిస్మస్ – న్యూ ఇయర్ సందర్భంగా ‘బంపర్‌ కేరళ’ 400 మందికి విక్రయించినట్లు తెలుస్తుంది. దాదాపు 45 లక్షలకు పైగా టికెట్ అమ్మకాలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

An unidentified person hit the jackpot with the lottery in Kerala

గత ఏడాది కోయంబత్తూర్ కు చెందిన గోకులం నటరాజ్ అనే వ్యక్తికి అదృష్టం వరించి రూ.25 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. కేరళాలో ఓనం సందర్భంగా అక్కడ ప్రభుత్వం తీసిన లాటరీ లో టికెట్ నంబర్ టీఈ 230662 కొన్నాడు. ఈ టికెట్ ని పాలక్కడ్ లోని వలయాడ్ సమీపంలో ఉన్న భవ ఏజెన్సీ ఈ టికెట్ అమ్మారు. 25 కోట్లలో 30 శాతం ట్యాక్స్ పోగా… రూ.17.5 కోట్లు నటరాజ్ అందుకున్నారు. ఈ లాటరీలో గెల్చుకున్న ప్రైజ్ మనీ డ్రా తీసిన తర్వాత 30 రోజుల్లోపు క్లయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.5 వేల లోపు అయితే.. నేరుగా లాటరీ కొనుగోలు చేసిన వెంటనే తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ అంతకు మించి నగదు అయితే.. వారి టికెట్లను బ్యాంకు లేదా ప్రభుత్వ లాటరీ ఆఫీస్ లో ఇచ్చి నగదు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి