iDreamPost
android-app
ios-app

కూతురికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్!

  • Published Nov 25, 2023 | 3:40 PM Updated Updated Nov 25, 2023 | 3:40 PM

సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అమితాబచ్చన్ గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితం అయిన ఆయన ఇప్పుడు దక్షిణాది చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అమితాబచ్చన్ గురించి తెలియని వారు ఉండరు. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితం అయిన ఆయన ఇప్పుడు దక్షిణాది చిత్రాల్లో కూడా నటిస్తున్నారు.

కూతురికి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్!

భారతీయ చలన చిత్ర రంగంలో బిగ్ బీగా పేరు తెచ్చుకున్న అమితాబచ్చన్ గురించి ప్రత్యేక పరచయం అక్కరలేదు. బాలీవుడ్ లోనే కాదు.. ఇటీవల టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సందడి చేస్తున్నారు. ఓ వైపు యాడ్స్ లో నటిస్తూ.. మరో వైపు వెండితెరపై బిజీగా ఉన్నారు. ఇటీవల తన 81 వ పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నారు అమితాబచ్చన్. ఆయన కెరీర్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. నటుడిగా కొనసాగుతున్న సమయంలో ఇండియన్ టెలివిజన్ లో ది బిగ్గెస్ట్ షో గా వచ్చిన ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’తో మరింత పాపులర్ అయ్యారు. నటుడిగా ఎంత బిజీగా ఉన్నా.. అమితాబచ్చన తన కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఇండస్ట్రీ టాక్. ఈ క్రమంలోనే ఆయన కూతురుకి కనీవినీ ఎరుగని గిఫ్ట్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

1969 లో సౌత్ హిందుస్థానీ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆయన మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మాస్ హీరోగా ప్రేక్షకులు గుండెల్లో తనదైన ముద్ర వేశారు. అప్పట్లో ఇండస్ట్రీలో చాలా మంది సినీ నటులు తమ సహనటులను వివాహం చేసుకున్నారు. అమితాబచ్చన్ సైతం తన సహనటి అయిన జయ బచ్చన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు శ్వేత నందా, అభిషేక్ బచ్చన్. బాలీవుడ్ లో నటవారసుడిగా అభిషేక్ బచ్చన్ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. అమితాబచ్చన్ క మొదటి నుంచి కూతురు అంటే అమితమైన ప్రేమ.. అందుకే ఆమెకు ఊహించని బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం బాలీవుడ్ లో దీనికి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ముంబాయిలోని జూహూలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇంటిని తన కూతురు శ్వేత నందాకు బహుమతిగా ఇచ్చారు బిగ్ బీ. జూహూలో ఉంటున్న ఈ బంగ్లా ప్రతీక్షగా అందరికీ సుపరిచితమే. విలాసవంతమైన ఈ భవనం విలువ సుమారు 50 కోట్ల పై మాటే అంటున్నారు. అమితాబ్ 50 లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ చెల్లించి మరీ ఈ భవనాన్ని తన కూతురు పేరిట రిజిస్ట్రర్ చేయించినట్లు ఇండస్ట్రీ టాక్. నటుడిగా కొనసాగుతూ.. ఎన్నో దశబ్దాల పాటు ఇదే బంగ్లాలో నివాసం ఉన్నారు బిగ్ బీ. తర్వాత జల్సా అనే మరో బంగ్లాకు మకాం మార్చారు. ఇక అమితాబచ్చన్ కి ప్రతీక్ష, జల్సా బంగ్లాలతో పాటు జనక్ అనే మరో బంగ్లా కూడా ఉంది. తన కూతురుకి అపురూపమైన గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş