iDreamPost

అందమే ఆమె పాలిట శాపమైంది! భర్త ఎంతకు తెగించాడంటే?

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ దంపతులు భార్యాభర్తలు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ, భర్తే ఆమెపై అనుమనం పెంచుకుని కిరాతకానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ దంపతులు భార్యాభర్తలు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ, భర్తే ఆమెపై అనుమనం పెంచుకుని కిరాతకానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?

అందమే ఆమె పాలిట శాపమైంది! భర్త ఎంతకు తెగించాడంటే?

పైన ఫోటోలో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు మెరిన్. చిన్నప్పటి నుంచి ఆమెకు చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదివి జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని కలలు కనేది. అలా మెరిన్ ఉన్నత చదువులు కూడా పూర్తి చేసుకుంది. ఇక కొంత కాలానికి ఆమె తల్లిదండ్రులు అమెరికాలో ఉంటున్న ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. అనుకున్నట్లే ఆమె తల్లిదండ్రులు తమ కూతురుని అమెరికాలో స్థిరపడ్డ కేరళకు చెందిన ఓ వ్యక్తికి కూతురును ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. కానీ, చివరికి అందమే చివరికి మెరిన్ పాలిట శాపంగా మారింది. ఇంతకు ఈ స్టోరీలో అసలేం జరిగిందంటే?

ఫిలిప్ మాథ్యూ-మెరిన్ దంపతులు అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉండేవారు. వీరికి గతంలో వివాహం జరిగింది. భర్త ఓ చోట పని చేస్తుండగా.., భార్య ఫ్లోరిడా కోరల్ స్ప్రింగ్స్‌లోని బ్రోవార్డ్ హెల్త్ ఆస్పత్రిలో నర్సుగా పని చేసేది. అలా పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే కొనసాగింది. కానీ, మెరిన్ అందమే ఆమె పాలిట శాపంగా మారుతుందని అస్సలు ఊహించలేదు. రాను రాను భర్త మాథ్యూ భార్య మెరిన్ పై అనుమానం పెంచుకున్నాడు. భార్య మరొకరితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందని అనుకునేవాడు.

ఇదే విషయం గురించి భర్త భార్యను చాలా సార్లు నిలదీశాడు. అలాంటిదేం లేదని మెరిన్ చెప్పుకుంటూ వచ్చింది. అయినా మథ్యూ అనుమానం మాత్రం అస్సలు చచ్చిపోలేదు. దీంతో అతడు తరుచు ఇదే విషయంపై భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇదిలా ఉంటే.. మెరిన్ ఎప్పటిలాగే 2020 జులై 28న డ్యూటీకి వెళ్లింది. ఆ రోజు విధులు ముగించుకుని సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరింది. ఈ క్రమంలోనే కాపు కాసిన ఆమె భర్త మథ్యూ.. భార్యను కత్తితో 17 సార్లు పొడిచి అతి కిరాతకంగా పొడిచాడు. ఇంతటితో ఆగని ఈ దుర్మార్గుడు.. రక్తపు మడుగులో పడిపో ఉన్న భార్యపై కారు ఎక్కించాడు. ఈ ప్రమాదంలో మెరిన్ తీవ్రంగా గాయపడింది. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోవడంతో మెరిన్ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు వదిలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి భార్య మరణానికి భర్తే కారణమని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు నిందితుడు మథ్యూ ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు అతడిని రిమాండ్ కు తరలించింది. అయితే అమెరికాలోని ఫ్లోరిడా కోర్టును ఈ కేసును విచారించి ఇటీవల నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పుతో మృతురాలి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి