iDreamPost

అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టిస్తున్న వైరస్

అగ్రరాజ్యం వెన్నులో వణుకు పుట్టిస్తున్న వైరస్

అమెరికాలో కరొనా మహమ్మారి రోజు రోజుకి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. పరిస్తితి ఒక్కసారిగా అదుపు తప్పడంతో వైట్ హౌస్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చెస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా మంగళవారం ఒక్కరొజే కొత్తగా 10 వేల కరొనా పాజిటివ్ కేసులు నమోదవవడం పట్ల తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా కరొనా భాదితుల సంఖ్య 54 వేలు దాటింది. ఇదిలా వుంటే మరోవైపు మృతుల సంఖ్య కూడా రోజూరోజుకి పెరుగుతుంది.

బుధవారం ఒక్కరొజే 150 మందికి పైగా మృత్యువాత పడడం పరిస్తితికి అద్దం పడుతుంది. దీంతో ఇప్పటివరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఈ ప్రాణాంతక వైరస్ భారిన పడి మరణించిన వారి సంఖ్య 775 కి చేరింది. కరొనా తీవ్రత బాగ ఎక్కువ గా ఉన్న ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే మంగళ వారం ఒక్కరొజే 53 మంది మరణించారు. దీంతో అక్కడ మరణించిన వారి సంఖ్య 200 దాటింది. న్యూయార్క్ రాష్ట్రంలో ఈ వైరస్ తో భాద పడుతున్న వారి సంఖ్య 25 వేలు దాటి పోయింది. న్యూయార్క్ లో ప్రధాన వీధులతో సహా ప్రఖ్యాత టైమ్స్ స్క్వెర్ లో శ్మశాన వాతావరణాన్ని తలపిస్తుంది. న్యుజెర్సి, క్యాలిఫోర్నియా, మిసిస్సిపీ, ఇల్లినాయిస్, ఫ్లోరిడా రాష్ట్రాల్లో కుడా వైరస్ అందోళన కరంగా విజృంభిస్థుంది. అయితే వైరస్ తొలుత బయటపడిన వాషింగ్టన్ లో మంగళవారం ఒక్క కొత్త కేసు కుడా నమోదుకాలేదు. కాగ, అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈస్టర్ పర్వదినం (ఎప్రిల్ 12) నాటికి పరిస్తితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

కరోనా ని కట్టడి చెయ్యడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ట్రంప్ కోరారు. భారి సంఖ్యలో గుమికూడకుండా ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కొవాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అలాగే ఈ గడ్డు పరిస్తితులను తొలగించడానికి ప్రజల తక్షణ ఆర్ధిక ఇబ్బందులు తొలగించేలా ప్రభుత్వం ప్రతిపాదించిన 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ కి అమెరికన్ కాంగ్రెస్ త్వరలో ఆమోద ముద్ర వేస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా దేశంలో నివసిస్తున్న ఆసియా ప్రజల పట్ల ఎలాంటి గొడవలు లేకుండా సోదర భావం తో వ్యవహరించాలని ట్రంప్ అమెరికన్లకు పిలుపునిచ్చాడు. కాగా అమెరికా లో ఇప్పటివరకూ 3,70,000 మందికి కరొనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. ఇదే సమయంలో ప్రజలు బయటకి రాకుండా దాదాపు అన్నీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సేవలు, అన్నీ రంగాల్లో వాణిజ్య కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో రానున్న రోజుల్లో అమెరికా ఆర్ధిక రంగం పై లాక్ డౌన్ ప్రభావం తీవ్రంగా పడనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి