iDreamPost

అంబటి రాయుడు టార్గెట్ కోహ్లీనే.. ఈసారి ఓపెన్ గానే హేళన చేశాడు!

Ambati Rayudu New Post On RCB: అంబటి రాయుడు ఆర్సీబీ మంచి కోరి కొన్ని విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆర్సీబీపై తనకు ఉన్న ప్రేమను బయటపెట్టాడు. ఈసారి అతని టార్గెట్ కోహ్లీ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాడు.

Ambati Rayudu New Post On RCB: అంబటి రాయుడు ఆర్సీబీ మంచి కోరి కొన్ని విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆర్సీబీపై తనకు ఉన్న ప్రేమను బయటపెట్టాడు. ఈసారి అతని టార్గెట్ కోహ్లీ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాడు.

అంబటి రాయుడు టార్గెట్ కోహ్లీనే.. ఈసారి ఓపెన్ గానే హేళన చేశాడు!

అంబటి రాయుడు.. ప్రస్తుతం క్రికెట్ విషయంలో కంటే వివాదాలతోనే ఎక్కువగా ఈ పేరు వైరల్ అవుతోంది. రాయుడు కంటిన్యూగా వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా అతని టార్గెట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనే విషయం అందరికీ అర్థమైపోయింది. మొదట్లో అంతా చెన్నై ఓడించారు అందుకే ఆ అక్కసుతో కామెంట్స్ చేస్తున్నాడు అనుకున్నారు. కానీ, ఆ తర్వాత రాయుడు స్పెషల్ ఇంట్రెస్ట్ తో ఈ డీగ్రేడింగ్ కామెంట్స్, మాకింగ్ చేస్తున్నాడు అనే విషయం అర్థమవుతోంది. ఎందుకంటే అంబటి రాయుడు అసలు టార్గెట్ విరాట్ కోహ్లీ అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే విషయాన్ని రాయుడు స్యయంగా తన ట్వీటుతో చెప్పకనే చెప్పేశాడు. ఈసారి కాస్త ఓపెన్ గానే విమర్శలు గుప్పించాడు.

అంబటి రాయుడు కొన్నిరోజులుగా సిరీస్ ఆఫ్ పోస్ట్స్ తో ఆర్సీబీని మాక్ చేస్తూనే ఉన్నాడు. చెన్నై లేదు కాబట్టి ఈసారి కప్పు ఆర్సీబీ గెలవారి అని ముందు బాగానే చెప్పాడు. ఆ తర్వాత హేళన చేయడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నేరుగా విరాట్ కోహ్లీ పేరు చెప్పకుండానే ఆర్సీబీ బాగు పడాలంటే ఇలా చేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చేశాడు. ఆ విషయాన్ని తన ఎక్స్.కామ్ ఖాతాలో పోస్టు చేశాడు. వచ్చే మెగా వేలంలో ఇలా చేస్తే మాత్రం ఆర్సీబీ కప్పు కొడుతుందని.. ఇలా చేసుంటే ఇప్పటికే చాలానే టైటిల్స్ కొట్టేది అంటూ అంబటి రాయుడు అడగకుండానే చాలానే సలహాలు, సూచనలు ఇచ్చేశాడు.

Rayudu targets kohli

అంబటి రాయుడు పోస్ట్ లో ఏముందంటే.. “రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఇన్నేళ్లుగా సపోర్ట్ చేస్తున్న అభిమానులను చూస్తుంటే నా మనసు తరుక్కు పోతోంది. టీమ్ మేనేజ్మెంట్- లీడర్స్ వ్యక్తిగత మైలురాళ్లు కాకుండా టీమ్ ప్రయోజనాల గురించి ఆలోచన చేసుంటే ఇప్పటికే ఆర్సీబీ జట్టు ఎన్నో టైటిల్స్ గెలిచి ఉండేది. ఒకసారి గుర్తు పెట్టుకోండి ఎంత మంది అద్భుతమైన ఆటగాళ్లను వదులుకున్నారో. కేవలం టీమ్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లను తీసుకునేలా.. మీ ఆర్సీబీ మేనేజ్మెంట్ ని ఫోర్స్ చేయండి. మెగా ఆక్షన్ నుంచి ఒక గ్రేట్ ఛాప్టర్ మొదలు కాబోతోంది” అంటూ అంబటి రాయుడు పోస్ట్ చేశాడు.

ఈ పోస్ట్ చూసిన తర్వాత రాయుడు అసలు కన్సర్న్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమైపోతోంది అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడైతే 2019 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ అయ్యిందో అప్పటి నుంచి రాయుడు.. కోహ్లీ విషయంలో విషం కక్కుతూనే ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు మొత్తం కోహ్లీని హేళన చేసేందుకే చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా ఎంత ఏడ్చినా కూడా కోహ్లీ సాధించిన ఘనత సాధించడం మాత్రం రాయుడు వల్ల కాదు అంటూ ఆర్సీబీ అభిమానులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే రాయుడిని వరల్డ్ కప్ కి సెలక్ట్ చేయకపోవడమే మంచిది అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి