iDreamPost

మానవత్వం చాటుకున్న ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్..

మానవత్వం చాటుకున్న ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన కాన్వయ్ లో ఎక్కించి.. ఆస్పత్రికి తరలించారు. ఇటీవలే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడ మంచి మనస్సును చాటుకున్నారు. రోడ్డుపై ఆటో ప్రమాదానికి గురి కాగా.. అటుగా వెళ్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి.. బాధితులను తన కారులో ఆస్పత్రికి తరలించారు. తాజాగా గుడివాడ అమర్నాథ కూడా ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి ఆదుకున్నారు.

విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పినపోలు నాగేశ్వరావు, అతని తమ్ముని  కుమారుడు సంజయ్ అనే 10 ఏళ్ల బాలుడితో శుక్రవారం మధ్యాహ్నం విశాఖ వైపు వెళ్తున్నారు.  మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన  ఉన్న అల్యూమినియం రైలింగ్ ని ఢీ  కొట్టింది. దీంతో కింద పడటంతో వీరిద్దరికి తీవ్ర గాయాలు  అయ్యాయి.  నాగేశ్వరరావుకు తలతో పలు చోట్ల గాయాలు కావడంతో రక్తస్రావం బాగా అయింది. అలాగే బాలుడికి కూడా తీవ్ర గాయాలతో  రోడ్డు మీద పడి ఉన్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ అనకాపల్లి నియోజకవర్గంలో కార్యక్రమాలు ముగించుకుని విశాఖపట్నం వస్తున్నారు. రోడ్డు పక్కన రక్తమోడుతూ బాధితులు కనిపించారు. వెంటనే ఆయన వాహనం దిగి.. తన కాన్వాయ్ లో ఉన్న ఒక వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, పోలీసులు సాయంతో లంకెలపాలెం ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అక్కడి నుంచి రెండు అంబులెన్స్ ద్వారా  క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విశాఖకు పంపించాలని మంత్రి అమర్నాథ్ .. వైద్యాధికారులను ఆదేశించారు. దీంతో వారిద్దిని విశాఖ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అయితే మంత్రి చేసిన ఈ పనిపై ప్రశంసల వస్తున్నాయి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:

ఏపీ ప్రభుత్వ చర్యలు భేష్.. CM జగన్ కు యూనిసెఫ్ టీమ్ అభినందన

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి