iDreamPost

ఏపీ ప్రభుత్వ చర్యలు భేష్.. CM జగన్ కు యూనిసెఫ్ టీమ్ అభినందనలు

ఏపీ ప్రభుత్వ చర్యలు భేష్.. CM జగన్ కు యూనిసెఫ్ టీమ్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి.. పాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టని అనేక సంక్షేమ పధకాలను సీఎం జగన్ ప్రవేశ పెట్టారు. పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే పధకాలు.. అర్హులైన ప్రతి ఒక్కరి అందేలా పటిష్టమైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ పరిపాలనపై అనేక మంది ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాక సీఎం జగన్ పరిపాలకు దేశ, అంతర్జాతీయ స్థాయిలో పొందిన అవార్డులే గీటు రాయి. తాజాగా యూనిసెఫ్ ఫీల్ టీమ్ సీఎం జగన్ కి అభినందనలు తెలిపారు. ఏపీలో పరిపాలన భేష్  అంటూ ప్రశంసించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌ జెలలీమ్‌ బి.టఫ్పెస్సే.. సీఎం క్యాంపు కార్యాయంలో కలిశారు. ఈ సందర్బంగా గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానంగా పనిచేసేందుకు యూనిసెఫ్‌ ఫీల్డ్‌ ఆఫీస్‌ చీఫ్‌ సంసిద్థంగా ఉన్నట్టు వారు తెలిపారు. అంతేకాక వైద్య, ఆరోగ్యం రంగంలోని వివిధ స్థాయిల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కుటుంబ వైద్యుడు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, హెల్త్‌ అండ్‌ వెల్నెస్‌ సెంటర్స్‌ వంటి వివిధ స్థాయిల్లో ఏపీకి అవసరమైన విధంగా తోడ్పాటు ఇచ్చేందుకు యూసిసెఫ్‌ ముందుకొచ్చినట్టు ఆ బృందం స్పష్టం చేసింది.

ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం వివిధ రంగాల్లో  తీసుకుంటున్న చర్యలపై యూనిసెఫ్‌ టీమ్.. సీఎం జగన్‌ తో చర్చించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో తమ ప్రభుత్వం ముందుకెళ్తున్న తీరును సీఎం జగన్‌ వారికి వివరించారు. దీంతో, ప్రభుత్వ నిర్ణయాలను వారు అభినందించారు. రక్షణ, ఆరోగ్యం రంగాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని అందిస్తామని యూనిసెఫ్  టీమ్ తెలిపింది. ఆరోగ్య సురక్ష పేరుతో త్వరలోనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు యూనిసెఫ్‌ ప్రతినిధులకు సీఎం జగన్‌ తెలిపారు. మరి.. ఏపీ ప్రభుత్వాన్ని యూనిసెఫ్ బృందం అభినందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియగజేయండి.

ఇదీ చదవండి: ఒకేసారి రెండు శుభవార్తలు చెప్పిన సీఎం జగన్‌.. బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో నిధులు జమ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి