iDreamPost

Amanjot Kaur: వీడియో: ఉమెన్స్‌ టీమ్‌లో మరో కోహ్లీ! క్యాచ్‌ చూస్తే మీరే ఒప్పుకుంటారు

  • Published Dec 10, 2023 | 4:34 PMUpdated Dec 11, 2023 | 1:13 PM

ఇండియన్‌ క్రికెట్‌లో బెస్ట్‌ ఫీల్డర్స్‌లో విరాట్‌ కోహ్లీ ఒకడు. కేవలం బ్యాటింగ్‌తోనే కాదు తన ఫీల్డింగ్‌తో కూడా మెస్మరైజ్‌ చేయగలడు. కాగా, ఇప్పుడు ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో కూడా ఓ కోహ్లీ ఉన్నారు. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్‌ క్రికెట్‌లో బెస్ట్‌ ఫీల్డర్స్‌లో విరాట్‌ కోహ్లీ ఒకడు. కేవలం బ్యాటింగ్‌తోనే కాదు తన ఫీల్డింగ్‌తో కూడా మెస్మరైజ్‌ చేయగలడు. కాగా, ఇప్పుడు ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో కూడా ఓ కోహ్లీ ఉన్నారు. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 10, 2023 | 4:34 PMUpdated Dec 11, 2023 | 1:13 PM
Amanjot Kaur: వీడియో: ఉమెన్స్‌ టీమ్‌లో మరో కోహ్లీ! క్యాచ్‌ చూస్తే మీరే ఒప్పుకుంటారు

విరాట్‌ కోహ్లీ అనగానే చాలా మందికి బ్యాటింగ్‌ గుర్తుకువస్తుంది. అందులో తప్పులేదు.. ఎందుకంటే కోహ్లీ అద్భుతమైన బ్యాటర్‌. ప్రపంచ క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్‌. ఎన్నో గొప్ప గొప్ప రికార్డులు అతనికి దాసోహం అయ్యాయి. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ రికార్డులను ఒక్కొక్కటిగా వేటాడు వెళ్తున్నాడు కింగ్‌ కోహ్లీ. అయితే.. కోహ్లీ అంటే బ్యాటింగ్‌ ఒక్కటే కాదు. అతనో అద్భుతమైన ఫీల్డర్‌ కూడా.. గ్రౌండ్‌లో చిరుతలా పరిగెడుతుంటాడు. పులి.. జింకను వేటాడి ఒడిసిపట్టినట్లు.. ప్రత్యర్థి బ్యాటర్లు ఆడిన షాట్లను అద్భుతంగా క్యాచ్‌గా అందుకుంటూ ఉంటాడు. ఇప్పటికే కోహ్లీ ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. ఫీల్డింగ్‌లో కోహ్లీ చేసే విన్యాసాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. అయితే.. ఇండియన్‌ ఉమెన్స్‌ టీమ్‌లో కూడా ఓ కోహ్లీ ఉన్నారు. ఒక్క క్యాచ్‌తో తానో లేడీ కోహ్లీని ప్రపంచానికి చాటి చెప్పింది.. అమంజోత్‌ కౌర్‌.

శనివారం ఇండియా-ఇంగ్లండ్‌ ఉమెన్స్‌ టీమ్స్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో అమంజోత్‌ కౌర్‌ ఈ అద్భుతమైన క్యాచ్‌ అందుకుంది. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ మూడో బంతిని ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఆలిస్ క్యాప్సే కవర్స్‌లోకి మంచి షాట్‌ ఆడింది. కానీ, ఎక్స్‌ట్రా కవర్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న అమంజోత్‌ కౌర్‌ గాల్లోకి దూకుతూ.. సూపర్‌ క్యాచ్‌ అందుకుంది. ఆ క్యాచ్‌ చూసి.. ఇండియన్‌ క్రికెటర్లతో పాటు క్రీజ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ క్రికెటర్లు సైతం కళ్లు తేలేశారు. ఒక్కసారిగా గ్రౌండ్‌ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ క్యాచ్‌ చూసిన ఏ క్రికెట్‌ అభిమానికైనా.. విరాట్‌ కోహ్లీ గుర్తుకు వస్తాడు. ఓ మ్యాచ్‌లో కోహ్లీ కూడా సేమ్‌ ఇలాంటి క్యాచ్‌నే పట్టాడు. ఆ రెండు క్యాచ్‌లను పక్కపక్కన పెట్టి చూస్తే.. మిర్రర్‌ ఇమేజ్‌లా ఉంటుంది. మరో విశేషం ఏంటంటే.. ఈ అద్భుతమైన క్యాచ్‌ పట్టిన అమంజోత్‌ కౌర్‌.. సబ్‌స్టిట్యూడ్‌ ఫీల్డర్‌గా వచ్చింది.

lady kohli catch

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి.. 16.2 ఓవర్లలోనే కేవలం 80 పరుగులకే ఆలౌట్‌ అయింది. రోడ్రిగ్స్ 30, స్మృతి మంధాన 10 మినహా.. మరే బ్యాటర్‌ కూడా డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ను క్రాస్‌ చేయకపోవడం గమనార్హం. 81 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఇంగ్లండ్‌ జట్టు.. కేవలం 11.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఊదిపారేసింది. అమంజోత్‌ కౌర్‌ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌ చేరిన ఆలిస్ క్యాప్సే 25 పరుగులతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా క్రికెటర్‌ అమంజోత్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ను కిందున్న వీడియోలో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి