iDreamPost

Allu Arjun: నెల రోజులు అల్లు అర్జున్ చెప్పినట్లు చేయనున్న మంచు లక్ష్మీ.. ఎందుకంటే?

  • Published Jan 05, 2024 | 10:32 PMUpdated Jan 05, 2024 | 10:32 PM

ప్రముఖ నటి మంచు లక్ష్మీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెషల్ టాస్క్ ఇచ్చారు. తాను చెప్పినట్లు నెల రోజులు చేయాలన్నారు. అసలు లక్ష్మీకి బన్నీ ఇచ్చిన ఆ టాస్క్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ నటి మంచు లక్ష్మీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ స్పెషల్ టాస్క్ ఇచ్చారు. తాను చెప్పినట్లు నెల రోజులు చేయాలన్నారు. అసలు లక్ష్మీకి బన్నీ ఇచ్చిన ఆ టాస్క్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 05, 2024 | 10:32 PMUpdated Jan 05, 2024 | 10:32 PM
Allu Arjun: నెల రోజులు అల్లు అర్జున్ చెప్పినట్లు చేయనున్న మంచు లక్ష్మీ.. ఎందుకంటే?

ఒకే ఒక్క హిట్​తో పాన్ ఇండియా స్టార్​గా మారిపోయారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రంతో ఆయన నేషనల్ స్టార్ అయిపోయారు. ఇందులో చిత్తూరు యాసలో ఆయన అదరగొట్టారు. ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గానూ నేషనల్ బెస్ట్ యాక్టర్​గానూ నిలిచారు అల్లు అర్జున్. దీంతో ఒకప్పుడు తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమకే పరిమితమైన బన్నీ ఇమేజ్, క్రేజ్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్​కు చేరుకుంది. ఆయన నుంచి వచ్చే అప్​డేట్స్ కోసం ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా మూవీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే బన్నీ కుదిరినప్పుడల్లా తన అభిమానులతో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంటారు. అలాంటి అల్లు అర్జున్​ ఓ నటికి స్పెషల్ టాస్క్ ఇచ్చారు. ఒక నెలంతా తాను చెప్పినట్లు చేయాల్సిందేనన్నారు. ఆ నటి మరెవరో కాదు మంచు లక్ష్మీ.

కొత్త ఏడాది సందర్భంగా మంచు లక్ష్మీకి అల్లు అర్జున్ ఓ టాస్క్ ఇచ్చారు. ఈ ఇయర్ తాను నిర్దేశించుకున్న గోల్స్ ఏంటనేది పబ్లిక్​తో షేర్ చేసుకోవాలని బన్నీ సూచించారు. ఐకాన్ స్టార్ విసిరిన ఈ ఛాలెంజ్​ను లక్ష్మీ స్వీకరించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అందరితో ఆమె షేర్ చేశారు. తన గోల్స్​ను పబ్లిక్​తో పంచుకోవాలని అల్లు అర్జున్ సూచించారని లక్ష్మీ చెప్పారు. ఆయన ఛాలెంజ్​ను తాను అంగీకరిస్తున్నానని తెలిపారు. ఈ నెలలో రైస్, నాన్​ వెజ్​కు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని.. ఇదే తన గోల్ అన్నారామె. ఇది చాలా ఛాలెంజింగ్ అని.. ఈ రెండూ లేకుండా తాను ఉండలేనన్నారు. రైస్, నాన్ వెజ్​లో ఒకటి తన ఫేవరెట్ అని లక్ష్మీ పేర్కొన్నారు. అయితే ఈ ఛాలెంజ్​ను తాను స్వీకరిస్తున్నానని.. ఇక మీదట ఏం జరుగుతుందో చూడాలని ఆమె ఓ పోస్ట్​ పెట్టారు.

manchu lakshmi bunny

మంచు లక్ష్మీ పెట్టిన పోస్ట్​ను బన్నీ తన అఫీషియల్ ఇన్​స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ఆమెకు ఆల్​ ది బెస్ట్ అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఇక, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’లో యాక్ట్ చేస్తున్నారు. షూటింగ్ స్టేజ్​లో ఉన్న ఈ ఫిల్మ్ ఆగస్టు 15వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది. టాలీవుడ్​, మాలీవుడ్​తో పాటు కోలీవుడ్, బాలీవుడ్​లోనూ ఈ సినిమాపై భారీ ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి. కాగా, మంచు లక్ష్మీ ప్రస్తుతం ‘ఆదిపర్వం’ అనే మూవీలో నటిస్తున్నారు. సంజీవ్ మేగోటి డైరెక్ట్ చేస్తున్న ఈ ఫిల్మ్ నుంచి ఇప్పటికే లక్ష్మీ ఫస్ట్ లుక్ రిలీజై ఆకట్టుకుంది. మరి.. నెల రోజల పాటు బన్నీ చెప్పినట్లు చేస్తానంటూ మంచు లక్ష్మీ ఛాలెండ్ యాక్సెప్ట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: గులాబి బ్యూటీ మహేశ్వరి ఇంతలా మారిపోయిందేంటీ..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి