iDreamPost

మామ కోసం ఐకాన్ స్టార్.. తొలిసారి ఎన్నికల ప్రచారంలో..!

  • Author singhj Updated - 08:37 PM, Fri - 11 August 23
  • Author singhj Updated - 08:37 PM, Fri - 11 August 23
మామ కోసం ఐకాన్ స్టార్.. తొలిసారి ఎన్నికల ప్రచారంలో..!

టాలీవుడ్​ నుంచి తన క్రేజ్​ను మాలీవుడ్, బాలీవుడ్​కు పెంచుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఒకే ఒక్క సినిమాతో ఆయన నేషనల్ స్టార్ అయిపోయారు. ‘పుష్ప’ చిత్రంతో టాక్​ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన బన్నీని మళ్లీ వెండితెరపై ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప 2’ షూటింగ్​తో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్​కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పలు బిజినెస్​లు స్టార్ట్ చేసిన బన్నీ.. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ డైరెక్ట్​గా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకపోయినా తన మామ కోసం రంగంలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మామ అంటే జనసేనాని పవన్ కల్యాణ్ అనుకునేరు! కాదండోయ్.. తనకు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డి కోసం రాజకీయాల్లోకి వస్తున్నారట బన్నీ. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్​ సమీపిస్తున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. నేతలు పర్సనల్​గా తమ మైలేజీ పెంచుకునేందుకు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన అల్లుడు అల్లు అర్జున్​కు ఉన్న సినీ గ్లామర్​ను వాడుకునేందుకు చంద్రశేఖర్ రెడ్డి సిద్ధమయ్యారని రూమర్స్ వస్తున్నాయి.

పిల్లనిచ్చిన మామ కోసం బన్నీ కూడా సరే అన్నారని టాక్. నాగార్జున సాగర్ టికెట్ తనకు కన్ఫర్మ్ చేశారని బీఆర్​ఎస్​ శ్రేణులకు స్పష్టం చేస్తున్నారట కంచర్ల. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ప్రచారాన్ని మొదలుపెట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్​తో ఇప్పటి నుంచే ప్రచారం చేయించేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు 19న మామ కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డితో కలసి అల్లు అర్జున్ నాగార్జున సాగర్​లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. కంచర్ల 2014 ఎలక్షన్స్​లో ఇబ్రహీంపట్నం నుంచి బీఆర్​ఎస్​ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.

allu arjun in politics 1

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి