iDreamPost

పెద్ద సినిమాల కళ్ళు గోపిచంద్ మీదే

పెద్ద సినిమాల కళ్ళు గోపిచంద్ మీదే

ఎల్లుండి గోపిచంద్ సీటిమార్ భారీ ఎత్తున థియేట్రికల్ రిలీజ్ జరుపుకోబోతోంది. జులై 30 సెకండ్ లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరిచాకా ఇప్పటిదాకా భారీ వసూళ్లు తెచ్చిన సినిమా ఏదీ లేదు. అన్నీ మీడియం రేంజ్ వి కావడం వాటి బిజినెస్ కు తగ్గట్టు సేఫ్ అవ్వడమో లాభాలు ఇవ్వడమో జరిగింది. ఒక్క శ్రీదేవి సోడా సెంటర్ మాత్రమే అంచనాలు అందుకోలేక కాస్త ఎక్కువ నష్టాలు తెచ్చింది. అయితే సుధీర్ బాబు కన్నా గోపిచంద్ మార్కెట్ పెద్దది కాబట్టి ఇప్పుడు పాజిటివ్ టాక్ కనక వస్తే కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయనే అంచనాలతో డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపిలో సెకండ్ షోలు లేకుండా సగం సీట్లతో ఎంత వస్తుందనే లెక్కలు వేసుకుంటున్నారు.

Also Read: రామ్ చరణ్ శంకర్ లు మొదలుపెట్టేశారు

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు సీటిమార్ టోటల్ థియేట్రికల్ బిజినెస్ సుమారు 12 కోట్లకు దగ్గరగా ఉంది. బ్రేక్ ఈవెన్ చేరుకోవాలంటే దీనికి ఓ యాభై లక్షలు అదనంగా తెస్తే సరిపోతుంది. ఆపై వచ్చేదంతా లాభమే. ఇది జరగాలంటే బ్లాక్ బస్టర్ టాక్ చాలా అవసరం. అసలే స్పోర్ట్స్ డ్రామా.దర్శకుడు సంపత్ నంది కమర్షియల్ అంశాలు గట్టిగా జొప్పించినా కూడా అమ్మాయిల కబడ్డీ ఆటను మాస్ ప్రేక్షకులు ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ముఖ్యంగా బిసి సెంటర్లు ఇందులో చాలా కీలకంగా మారబోతున్నాయి. బాగుందని మౌత్ పబ్లిసిటీ వస్తే చాలు మిగిలినదంతా జనమే చూసుకుంటారు

స్క్రీన్ కౌంట్ కూడా గట్టిగానే ఉండబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో 350 దాకా తెలంగాణలో 220 దాకా థియేటర్లు ఇచ్చారని సమాచారం. ముందు రోజు విజయ్ సేతుపతి లాభం, అదే రోజు కంగనా రౌనత్ తలైవి ఉండటంతో నెంబర్లు కాస్త తగ్గాయి కానీ ఓవరాల్ గా సీటిమార్ కే ఎక్కువ అడ్వాంటేజ్ దక్కింది. ఆ రెండు అంతగా బజ్ లేని డబ్బింగ్ సినిమాలు కావడం కూడా కలిసివస్తోంది. ఇప్పుడు పెద్ద నిర్మాతలు దీనికి వచ్చే స్పందన పట్ల ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ సీటిమార్ కనక మేజిక్ నెంబర్ ని దాటేసి కనీసం ఒక 15 కోట్లు తెస్తే తమ డేట్లు ప్రకటించేందుకు సమాయత్తమవుతున్నారు. చూద్దాం ఈ ఆటల సినిమా అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో

Also Read: పుష్ప తర్వాత సినిమా లాక్ అయినట్టే 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి