iDreamPost

వాహనదారులకు అలర్ట్.. ఈ రోజు హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు!

  • Published Nov 11, 2023 | 10:33 AMUpdated Nov 11, 2023 | 10:33 AM

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నిక సందడి జోర్ దార్ గా నడుస్తుంది. రాష్ట్ర నాయకులు, జాతీయన నేతలు ప్రచాచాలతో దుమ్మురేపుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నిక సందడి జోర్ దార్ గా నడుస్తుంది. రాష్ట్ర నాయకులు, జాతీయన నేతలు ప్రచాచాలతో దుమ్మురేపుతున్నారు.

  • Published Nov 11, 2023 | 10:33 AMUpdated Nov 11, 2023 | 10:33 AM
వాహనదారులకు అలర్ట్.. ఈ రోజు హైదరాబాద్‎లో ట్రాఫిక్ ఆంక్షలు!

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈసారి గెలుపు తమ ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ సాధించేందుకు అధికార పార్టీ బీఆర్ఎస్ గట్టి పట్టుమీద ఉంది. అధికార పార్టీని ఎలాగైనా గద్దెదించి తాము అధికారంలోకి రావాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీ నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీ కి సంబంధింది ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, కీలక నేతలు, జాతీయ నేతలు వచ్చి ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రధాని మోదీ నగరానికి రాబోతున్నారు..ఈ క్రమంలోనే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాదు పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అవి ఎక్కడో చూద్దాం.

నేడు హైదరాబాద్ కి ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయుచున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేడు ప్రధాని మోదీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాదిగల విశ్వరూప బహిరంగ సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. అందులో భాగంగా సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్ కి చేరుకొని అక్కడ దాదాపు 45 నిమిషాల పాటు సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగం పేట్ నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రయాణికులు, వాహనదారులు ఈ మార్గాల్లో కాకుండా.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా హైదరాబాద్ పోటీసులు సూచించారు.

బేగంపేట నుంచి సంగీత్ ఎక్స్ రోడ్ వైపు వెళ్లే వాహనదారులు సీటీఓ ఎక్స్ రోడ్డు వద్ద తివోలీ, స్వీకార్ ఉపకార్, బాలమ్ రాయ్, బ్రూడ్ బాండ్, సెయింట్ జాన్సర్ రోటరీ మీదుగా వెళ్లాల్సిందిగా సూచించారు. ఇక కార్ఖానా, జేబీఎస్ నుంచి ఎస్ బీఐ ప్యాట్నీ వైపు స్వీకార్ ఉపకార్ నుంచి వైఎంసీఏ, క్లాక్ టవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్యాట్నీ నుంచి ఎస్ బీఐ, స్వీకార్ ఉపకార్ వపు వాహనాలను అనుమతించారు. వారంతా క్లాక్ టవర్ నుంచి వైఎంసీఏ వైపుగా వెళ్లాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి బేగం పేట్ వైపు వెళ్లే వాహనదారులు పంజాగుట్ట, ఖైరతాబాద్, రాజ్ భవన్, గ్రీన్ లాండ్ వైపు మళ్లిస్తారు. సంగీత్ ఎక్స్ రోడ్ నుంచి బేగంపేట వైపు వెళ్లే వాహనదారులు వైఎంసీఏ నుంచి క్లాక్ టవర్, సీటీఒ, ప్యాట్నీ, రసూల్ పుర నుంచి బేగం పేటకు వెళ్లాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి