iDreamPost

అల నాన్ బాహుబలిపురములో – ఫైనల్ వసూళ్లు

అల నాన్ బాహుబలిపురములో – ఫైనల్ వసూళ్లు

సంక్రాంతికి చాలా టఫ్ కాంపిటీషన్ మధ్య బాక్స్ ఆఫీస్ బరిలో దిగిన అల వైకుంఠపురములో ఫైనల్ రన్ కు వచ్చేసింది . కొన్ని కీలకమైన సెంటర్లు మినహాయించి దాదాపు అన్ని చోట్ల సెలవు తీసుకునేందుకు రెడీ అవుతోంది. ట్రేడ్ నుంచి అందిన సమాచారం మేరకు అల వైకుంఠపురములో 150 కోట్ల 40 లక్షల షేర్ తో నాన్ బాహుబలి కిరీటాన్ని దర్జాగా తీసుకుంది. ప్రచారం విషయంలో రికార్డులు మావంటే మావని సరిలేరు నీకెవ్వరు టీం పోటీ పడినప్పటికీ ఫైనల్ గా విన్నర్ మాత్రం బన్నీనే అయ్యాడు.

ఏడాదిన్నర గ్యాప్ కు న్యాయం చేకూరుస్తూ ప్రేక్షకులు బ్రహ్మాండమైన విజయాన్ని అందించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల దర్శకత్వపు మాయాజాలంతో పాటు తమన్ అద్భుతమైన సంగీతం వసూళ్ళకు చాలా దోహద పడింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ దీనికి చాలా ప్లస్ అయ్యింది. ఇక లెక్కల విషయానికి వస్తే నైజాంలో 39 కోట్ల 50 లక్షల షేర్ రాబట్టిన ఈ మూవీ వైజాగ్ లో 18 కోట్ల 50 లక్షలు, సీడెడ్ లో రికార్డు స్థాయిలో 19 కోట్ల 25 లక్షలు వసూలు చేసి కొత్త బెంచ్ మార్కు సెట్ చేసింది.

మిగిలిన ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో రికార్డుల ఊచకోత చేసిన అల వైకుంఠపురములోకు ఇప్పటికీ వీకెండ్స్ లో కొన్ని చోట్ల డీసెంట్ కలెక్షన్స్ వస్తుండటం గమనార్హం. కొత్త సినిమాల తాకిడి విపరీతంగా ఉండటంతో ఇక ఫైనల్ స్టేజికి వచ్చేసింది. సింగల్ డిజిట్ లో హండ్రెడ్ డేస్ సెంటర్స్ రావొచ్చని ట్రేడ్ అంచనా. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైన్మెంట్ డ్రామా ఇటీవలే సన్ నెక్స్ట్ , నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ జరగ్గా త్వరలో శాటిలైట్ టెలికాస్ట్ కూడా కాబోతోంది. ఏరియాల వారిగా ఫైనల్ గా వచ్చిన షేర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

అలా వైకుంఠపురములో ఫుల్ రన్ వసూళ్లు:

ఏరియా  షేర్ 
నైజాం  39.50cr
సీడెడ్  19.25cr
ఉత్తరాంధ్ర  18.50cr
గుంటూరు  9.50cr
క్రిష్ణ  9.40cr
ఈస్ట్ గోదావరి  10.30cr
వెస్ట్ గోదావరి  8.10cr
నెల్లూరు  4.15cr
ఆంధ్ర+తెలంగాణా  118.70cr
కర్ణాటక + ROI  12.20cr
ఓవర్సీస్  19.50cr
ప్రపంచవ్యాప్తంగా 150.40cr

Verdict: All Time Block Buster

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి