iDreamPost

స్టార్ హీరో అక్షయ్ కుమార్​​పై సీనియర్ హీరోయిన్ బాడీ షేమింగ్ ఆరోపణలు!

  • Author singhj Published - 08:09 PM, Sat - 15 July 23
  • Author singhj Published - 08:09 PM, Sat - 15 July 23
స్టార్ హీరో అక్షయ్ కుమార్​​పై సీనియర్ హీరోయిన్ బాడీ షేమింగ్ ఆరోపణలు!

అక్షయ్ కుమార్.. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. ఖాన్ త్రయం నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొని అగ్రస్థానానికి చేరుకున్న కథానాయకుడు. వరుస హిట్స్​తో బాలీవుడ్ బాక్సాఫీస్​ను షేక్ చేసిన హీరోగా అక్షయ్​ను చెప్పొచ్చు. ఒకవైపు సీరియస్ సినిమాలు చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా కామెడీ మూవీస్ కూడా చేస్తుంటారాయన. అప్పుడప్పుడూ ప్రయోగాత్మక చిత్రాల్లోనూ అలరిస్తుంటారు. ‘రోబో 2’ మూవీతో సౌత్ ఆడియెన్స్​కు కూడా అక్షయ్ దగ్గరయ్యారు. ఫ్యాన్స్ అందరూ ఆయన్ను ఖిలాడీ, అక్కీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అలాంటి అక్షయ్ ఈమధ్య రేసులో వెనుకబడిపోయారు. వరుస ఫెయిల్యూర్స్​తో నిరాశలో కూరుకుపోయారు.

అక్షయ్ కుమార్ నటించిన రీసెంట్ మూవీస్ ‘లక్ష్మీ’, ‘రక్షా బంధన్’, ‘బచ్చన్ పాండే’, ‘రామ్​సేతు’, ‘సెల్ఫీ’ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాలు సాధించలేదు. వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న అక్కీ.. త్వరలో ‘ఓఎంజీ2’తో మరోమారు ఆడియెన్స్​ను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. బ్లాక్​ బస్టర్​గా నిలిచిన ‘ఓ మై గాడ్​’ మూవీకి ఇది సీక్వెల్. దీంతోనైనా అక్షయ్ సక్సెస్ బాట పడతారేమో చూడాలి. ఇదిలా ఉంటే.. అక్షయ్​పై సీనియర్ హీరోయిన్ శాంతిప్రియ ఆరోపణలు గుప్పించారు. నలుగురిలో ఉన్నప్పుడు కనీసం ఎలా మాట్లాడాలో కూడా ఆయనకు తెలియదని ఆమె అన్నారు. ఒక బాలీవుడ్ మూవీ షూటింగ్​ టైమ్​లో అక్షయ్ తనను బాడీ షేమింగ్ చేశాడని శాంతిప్రియ తెలిపారు. అలాంటి పరిస్థితి సౌత్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎదురవ్వలేదని ఆమె వెల్లడించారు.

Senior actress shanti priya comments on akshay kumar

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శాంతిప్రియ మాట్లాడుతూ.. అక్షయ్​తో తాను ‘ఇక్కే పే ఇక్కా’ సినిమా చేశానన్నారు. అందులో తనది గ్లామర్ రోల్ కావడంతో క్లైమాక్స్ షూటింగ్​లో కురచ దుస్తులు వేసుకున్నానని చెప్పారు. అప్పుడు అక్షయ్ తన మోకాలు వైపు చూసి శాంతి నీ కాలికి ఏమైందని అడిగారన్నారు. దీంతో ఏదైనా దెబ్బ తాకిందేమోనని చూసేసరికి.. అవి అంత నల్లగా ఉన్నాయేంటని అక్షయ్ అన్నారని శాంతిప్రియ చెప్పుకొచ్చారు. హీరో అలా అనేసరికి అక్కడున్న వారందరూ పగలబడి నవ్వారని పేర్కొన్నారు. జోక్ చేయడం తప్పు కాదని.. కానీ అందరిముందు జోక్ చేస్తే దాన్ని ఎగతాళి అంటారని శాంతిప్రియ వ్యాఖ్యానించారు. ఇక, ఈ శాంతిప్రియ ఎవరో కాదు.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భానుప్రియ సోదరి కావడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Shanthi Priya (@shanthipriya333)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి