iDreamPost

అఖిల్ శర్వాలు ఫిక్స్ చేసుకున్నారు

అఖిల్ శర్వాలు ఫిక్స్ చేసుకున్నారు

సెప్టెంబర్ మీద టాలీవుడ్ కు పెద్దగా ఆశలు ఉన్నట్టు కనిపించడం లేదు. ఆల్రెడీ ప్రకటించిన రిలీజులను కూడా వెనక్కు నెట్టేస్తున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ అక్టోబర్ లో రాదని కన్ఫర్మ్ కావడంతో మిగిలిన నిర్మాతలు అలెర్ట్ అయిపోయి తేదీలను బ్లాక్ చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అక్టోబర్ 8కి, శర్వానంద్-సిద్దార్ధ్ ల మహాసముద్రం అదే నెల 14కి లాక్ చేసుకున్నాయి. ఆ మేరకు అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి. ఆచార్య, అఖండ విషయంలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. రెండు పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉన్న చిరు బాలయ్యలు వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారో క్లారిటీ లేదు.

ఏడాదిన్నరగా ఊరిస్తూ వస్తున్న అఖిల్ సినిమాకు ఎట్టకేలకు మోక్షం దక్కబోతోంది. ఓటిటి అంటూ ఏవో వార్తలు వచ్చాయి కానీ ఫైనల్ గా వాటికి చెక్ పెట్టారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రేమకథలో హీరోయిన్ పూజా హెగ్డే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ట్రైలర్ ని త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు. విపరీతమైన జాప్యం వల్ల దీని మీద అభిమానులకు ఆసక్తి తగ్గిపోయింది. ఇప్పుడు బజ్ రావాలంటే ప్రమోషన్ చాలా కీలకం. దాన్ని ఎంత ఆగ్రెసివ్ గా చేస్తారనే దాని బట్టి బిజినెస్ కూడా ఎక్కువ ఆశించవచ్చు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తీసిన మహాసముద్రం మీద హైప్ భారీగానే ఉంది. హీరో హీరోయిన్ కాంబినేషన్ ఆసక్తి రేపుతోంది.

అదే నెలలో సాయి తేజ్ రిపబ్లిక్, వైష్ణవ్ తేజ్ కొండపోలం, రౌడీ బాయ్స్ కూడా షెడ్యూల్ చేసుకున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ఇంత అడ్వాన్స్ గా చెప్పుకున్న సినిమాలు ఖచ్చితంగా మాట మీద ఉంటాయన్న గ్యారెంటీ లేదు. కరోనా నుంచి పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవరికీ అంతు చిక్కడం లేదు. థర్డ్ వేవ్ ముప్పు తెలుగు రాష్ట్రాలకు లేకపోయినా కేరళలో ఆల్రెడీ ప్రమాదకర స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అందుకే కెజిఎఫ్ 2 లాంటివి సేఫ్ గేమ్ ఆడుతూ హ్యాపీగా 2022 సెకండ్ హాఫ్ కు వెళ్లిపోయాయి . ఇలాంటి మార్పులు చేర్పులు చాలానే చూడాల్సి ఉంటుంది

Also Read : ఇచట వాహనములు నిలుపరాదు రిపోర్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి