iDreamPost

రామ్ చరణ్ కు అన్నీ చిరంజీవి పోలికలే అన్న శర్వానంద్

  • Published Feb 10, 2024 | 4:14 PMUpdated Feb 10, 2024 | 4:14 PM

Sharvanand On Ram Charan: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

Sharvanand On Ram Charan: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

  • Published Feb 10, 2024 | 4:14 PMUpdated Feb 10, 2024 | 4:14 PM
రామ్ చరణ్ కు అన్నీ చిరంజీవి పోలికలే అన్న శర్వానంద్

నటుడు మంచు మనోజ్ ఉస్తాద్ పేరుతో ఈటీవీ విన్ కోసం టాక్ షోను హోస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా యువ నటుడు శర్వానంద్ కూడా ఈ టాక్ షోకు చీఫ్ గెస్ట్ గా వచ్చి ప్రేక్షకులను అలరించారు. ఈ ఎపిసోడ్ లో మనోజ్ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. మనోజ్ మాట్లాడుతూ -”చిరంజీవి గారి గొప్పతనం గురించి గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉంటాం. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తనను నమ్ముకున్న వారందరికీ సపోర్ట్ గా ఉంటున్నారు.

తన ప్రజల కోసం ఆయన ఎల్లప్పుడూ ఉంటారని మనోజ్ తెలిపారు. ఆయనకు హ్యాట్సాఫ్. చిరంజీవి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. పవర్ ఫుల్ మెగాస్టార్ కి పెద్ద కరతాళ ధ్వనులు చేద్దాం” అన్నారు. దీనికి శర్వానంద్ స్పందిస్తూ ” చిరంజీవిగారి లాగానే రామ్ చరణ్ కూడా తన వాళ్ల గురించి పట్టించుకుంటాడు. అతను అవసరమైన వారికి అండగా ఉంటాడు. అతని వంటి వ్యక్తి నా స్నేహితుడు అని నేను గర్వంగా చెప్పగలను. చరణ్ స్నేహితుడిగా ఉండటం నా అదృష్టం. చిరంజీవి గారిలో ఉన్న మంచి లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి” అన్నారు. శర్వానంద్- రామ్ చరణ్ చిన్ననాటి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఎన్నోసార్లు శర్వానంద్ తమ స్నేహం గురించి చెప్పుకొచ్చారు.

చిరంజీవి, రామ్ చరణ్ ల గురించి మనోజ్, శర్వానంద్ చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైన చెప్పుకున్న విధంగా శర్వానంద్ చరణ్ కు చిన్ననాటి స్నేహితుడు. ప్రస్తుతం మనోజ్ ‘వాట్ ది ఫిష్’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. మరో వైపు శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనం అనే ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి