iDreamPost

అక్కినేని కుర్రాడి సౌండ్ లేదే

అక్కినేని కుర్రాడి సౌండ్ లేదే

తెలుగులోనే కాదు ఏ బాషా పరిశ్రమలోనైనా స్టార్ హీరోల వారసులకు ఉండే సౌలభ్యం డెబ్యు మూవీ రిలీజ్ కాకుండానే అభిమానులను సంపాదించుకోవడం. దాన్ని నిలబెట్టుకున్నారా సరే. కెరీర్ కు తిరుగు ఉండదు. ఏ మాత్రం తేడా వచ్చినా నాన్నలు కూడా కాపాడలేరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అభిషేక్ బచ్చన్ కనీసం మీడియం రేంజ్ కూడా చేరుకోలేకపోయాడు. పరిస్థితి ఎలా ఉందంటే ఏడాదికి ఒక్క సినిమా కూడా చేతిలో లేకుండా ఖాళీగా ఉండేదాకా. ఇది ఫెయిల్యూర్ స్టొరీ.

ఇంకో ఉదాహరణ తీసుకుంటే చిరంజీవి పుత్రత్నం ట్యాగ్ తో వచ్చిన రామ్ చరణ్ కు అండగా నిలిచింది అశేష సంఖ్యలో నాన్నకు ఉన్న అభిమానులే. వరసగా హిట్లు రావడం రంగస్థలంలో తన నటనను ప్రూవ్ చేసుకోవడం లాంటివి బలమైన మార్కెట్ ని అందించాయి. ఒకవేళ చరణ్ కూడా అభిషేక్ బచ్చన్ లాగా ప్లానింగ్ లేకపోయి ఉంటే కథ ఇంకోలా ఉండేదేమో. సరే ఇక విషయానికి వస్తే అఖిల్ నాలుగో సినిమా షూటింగ్ మొదలుపెట్టి నెలలు దాటుతున్నా ఇప్పటిదాకా ఎలాంటి అఫీషియల్ అప్ డేట్స్ ఇవ్వడం లేదు. మరోపక్క దీని కన్నా చాలా ఆలస్యంగా స్టార్ట్ చేసిన సినిమాలు రిలీజ్ డేట్లను ప్రకటించి పక్కా ప్లానింగ్ తో ఉన్నాయి.

అఖిల్ సినిమాని జూన్ లో రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నారని ఫిలిం నగర్ టాక్. అది ఎప్పుడు అఫీషియల్ చేస్తారో తెలియదు. కెరీర్ ఐదో సంవత్సరంలో ఉన్నా అఖిల్ ఇప్పటిదాకా కనీసం యావరేజ్ కూడా అందుకోలేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను మూడూ నిరాశపరిచాయి.ఇలాంటి టైంలో అసలు ఫాంలో లేని బొమ్మరిల్లు భాస్కర్ ని దర్శకుడిగా ఎంచుకోవడం పట్ల అభిమానులు టెన్షన్ గా ఉన్నారు. గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ మూవీతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ కొట్టాలి. అప్పుడే ఫ్యాన్స్ కు ఊరట. మరోవైపు నాగ చైతన్య సక్సెస్ లు కొడుతున్నా ఇంకా పెద్ద రేంజ్ కు వెళ్ళలేకపోతున్నాడు.వారసుల స్టార్ డంని ఇంకా పైకి తీసుకెళ్ళేలా నాగార్జున ఎలాంటి ప్లానింగ్ తో ఉన్నాడో వేచి చూడాలి మరి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి