iDreamPost

వీడియో : అజిత్‌కు యాక్సిడెంట్.. వీడియో రిలీజ్

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ కు పెను ప్రమాదం జరిగింది. విదా మయూర్చి చిత్రం షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలను

కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ కు పెను ప్రమాదం జరిగింది. విదా మయూర్చి చిత్రం షూటింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలను

వీడియో : అజిత్‌కు యాక్సిడెంట్.. వీడియో రిలీజ్

కోలీవుడ్ టాప్ హీరో అజిత్ కుమార్ తెలుగు వారికి సుపరిచతమే. కెరీర్ తొలి నాళ్లలో ఓ తెలుగు చిత్రంలో నటించిన ఈ హీరో..  తన డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఉల్లాసం, ఆశ ఆశ ఆశ, వాలి, ప్రియురాలు పిలిచింది, ఆరంభం, వీరం, ఎంతవాడు గానీ, వివేకం, వాలిమై, తనివు చిత్రాలతో మెప్పించాడు. తనివు, వాలిమై ఇక్కడ కూడా బాగానే కలెక్షన్లను రాబట్టుకున్నాయి. తన సినిమాలతో తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు యాక్షన్ హీరో. తమిళంలో తన కన్నా మార్కెట్ తక్కువ ఉన్న సూర్య తరహా హీరోలు టీటౌన్‌పై కన్నేసి టాలీవుడ్ బాక్సాఫీసును దున్నేస్తుంటే.. అజిత్ కాస్త వెనకబడ్డాడనే చెప్పొచ్చు.

ప్రస్తుతం అజిత్ విదా ముయర్చి అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిష, రెజీనా కెసెండ్రా హీరోయిన్లు. అర్జున్ సర్జా, అర్జున్ సర్జా, అరుణ్ విజయ్, సంజయ్ దత్ , ఆరవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాకరన్ అల్లిరాజా తెరకెక్కిస్తోన్నాడు. అజిత్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. రూ. 200 కోట్లకు బడ్జెట్‌తో రూపొందున్నట్లు సమాచారం. మజీజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ మాటలు అందిస్తుండగా.. నీరవ్ షా, ఓం ప్రకాష్ ఛాయా గ్రహకులుగా వ్యవహరిస్తున్నారు. కాగా, అజిత్ 62గా తెరెక్కుతోన్న ఈ చిత్రం .. తొలుత విఘ్నేశ్ శివన్ దర్శకుడిగా వ్యవహరించాల్సి ఉండగా.. చివరి స్క్రిప్ట్ వర్క్‌తో అజిత్‌ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. చివరకు అతడి స్థానంలో మజీజ్ వచ్చి చేరాడు.  గత ఏడాది ఈ సినిమా షూటింగ్ స్టార్ అయ్యింది. అజర్ బైజాన్‌లో చిత్రీకరణ సమయంలో పెద్ద ప్రమాదం జరిగింది.

ఆ ప్రమాదంలో అజిత్ ప్రాణాలు నుండి బయపడ్డాడు. కాగా, ఆ లైవ్ వీడియోను విడుదల చేశాడు అజిత్ పీఆర్వో. షూటింగ్ సమయంలో కారు కంట్రోల్ తప్పడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గత అక్టోబర్-నవంబర్ సమయంలో జరిగింది. షూటింగ్‌లో భాగంగా రోడ్డుపై అజిత్ కారు నడుపుతుండగా..స్ట్రీరింగ్, బ్రేకులు పనిచేయకపోవడంతో కారును ఆపే ప్రయత్నం చేసినప్పటికీ.. వాహనం అదుపు తప్పి తల్లకిందులుగా పడిపోయింది. అజిత్ మెడకు గాయాలయ్యాయి.  కారులో ఉన్న కెమెరాతో పాటు బయట నుండి కెమెరాలు ఈ దృశ్యాలను రికార్డు చేశాయి. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన సిబ్బంది లోకేషన్‌కు పరుగులు తీశారు. ఇప్పుడు ఆ వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. చాలా పెద్ద ప్రమాదం నుండి అజిత్, ఆరవ్ తప్పించుకున్నారు. అంత పెను ప్రమాదంలో కూడా ఆయన ఆరవ్ గురించి అడిగాడని తెలుస్తోంది. కాగా, ఇదే షూటింగ్ సమయంలో ఆర్ట్ డైరెక్టర్ మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి