iDreamPost

టైటిల్: అజయ్ దేవఘన్ మైదాన్ మూవీ OTT పార్టనర్ ఖరారు

  • Published Apr 10, 2024 | 5:59 PMUpdated Apr 10, 2024 | 5:59 PM

ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. కానీ, నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని తెరకెక్కే సినిమాలు మాత్రం అందరిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో ఓటీటీలోకి మరొక రియల్ లైఫ్ స్టోరీ త్వరలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ సినిమా వివరాలేంటో చూసేద్దాం.

ఓటీటీలోకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. కానీ, నిజ జీవితాలను ఆధారంగా తీసుకుని తెరకెక్కే సినిమాలు మాత్రం అందరిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో ఓటీటీలోకి మరొక రియల్ లైఫ్ స్టోరీ త్వరలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. మరి ఆ సినిమా వివరాలేంటో చూసేద్దాం.

  • Published Apr 10, 2024 | 5:59 PMUpdated Apr 10, 2024 | 5:59 PM
టైటిల్: అజయ్ దేవఘన్ మైదాన్ మూవీ OTT పార్టనర్ ఖరారు

థియేటర్ లో భారీ రెస్పాన్స్ సాధించిన చిత్రాలకు ఇటు ఓటీటీలలో కూడా మంచి ఆదరణే లభిస్తుంది. అందులోను ఆయా చిత్రాలు నిజ జీవిత గాధలను ఆధారంగా తీసుకుని తెరకెక్కిన చిత్రాలైతే మాత్రం.. ఆ సినిమాలకు మరింత ఆదరణ లభిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఇలాంటి ఎన్నో చిత్రాలను మూవీ మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. వాటికీ లభించిన ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంది. ఇక కొన్ని సినిమాలు థియేటర్ రిలీజ్ కు ముందే ఓటీటీ డీల్ భారీగా ధరలకు క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటీవల భారత ప్రసిద్ధి గాంచిన ఫుట్ బాల్ కోచ్.. సయ్యద్ అబ్దుల్ రహీం జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కిన సినిమా “మైదాన్”. ఈ సినిమా ఏప్రిల్ ఏప్రిల్ 11వ తేదీన ఈద్ సంధర్బంగా థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు. కాగా, థియేటర్ రిలీజ్ కు ముందే ఈ సినిమా ఓటీటీ డీల్స్ భారీ ధరలకు అమ్ముడుపోయాయట. మరి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ఏ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుంది.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అనే వివరాలు తెలుసుకుందాం.

మైదాన్ అనే ఈ సినిమాను.. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ తరహాలో రూపొందించారు. ఈ స్పోర్ట్స్ బయోపిక్ మూవీకి.. అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమాలో హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించనున్నారు . అంతేకాకుండా నటి ప్రియమణి కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. వీరితో పాటు గజ్‍రాజ్ రావ్, దేవ్యాన్ష్ త్రిపాఠి, నితాన్షి గోయల్, ఆయేశా వింధారా, మీనల్ పటేల్, రుద్రాణి ఘోష్ ఈ సినిమాలో నటించారు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 11 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ దానికంటే ముందే.. ఓటీటీ డీల్ కూడా ముగిసిందట. ఈ మధ్య కాలంలో చాలా వరకు ఓటీటీ సంస్థలు ఇలా ముందస్తుగానే ఆయా సినిమాలను కొనుగోలు చేస్తున్నాయి. ఈ క్రమంలో మైదాన్ సినిమా ఓటీటీ డీల్ కూడా భారీ ధరలకే అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. కాగా, ఈ సినిమా థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని .. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఏప్రిల్ 11 న థియేటర్లో విడుదల కానున్న సినిమాకు.. ఇప్పటికే ప్రీమియర్ షోస్ పడ్డాయి. కొంతమంది క్రికెటర్స్ కు, సినీ సెలెబ్రెటీలకు ప్రీమియర్స్ ద్వారా ఈ సినిమాను చూపించారు. ఇప్పటివరకు ఈ సినిమా గురించి అంతటా చాలా పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. సోషల్ మీడియాలో కూడా మైదాన్ సినిమా గురించి బాగానే బజ్ వినిపిస్తోంది. మైదాన్ సినిమా అద్భుతంగా ఉందంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే చాలా మంది పోస్ట్స్ పెడుతున్నారు. దీనితో ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక వసూళ్ల విషయంలో కూడా ఈ సినిమా భారీగానే రాబడుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయినా తర్వాత పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరి, ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి