iDreamPost
android-app
ios-app

చిట్టచివరికి ఐశ్వర్యరాయ్ వేరు కుంపటి!

  • Published Dec 28, 2023 | 4:20 PM Updated Updated Dec 28, 2023 | 4:20 PM

Aishwarya Rai: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కారణం..తన అంద చందాలతో కాదు నటనతో దేశ వ్యాప్తంగా కూడా ఆమె అభిమానులను సంపాదించుకుంది.

Aishwarya Rai: బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కారణం..తన అంద చందాలతో కాదు నటనతో దేశ వ్యాప్తంగా కూడా ఆమె అభిమానులను సంపాదించుకుంది.

  • Published Dec 28, 2023 | 4:20 PMUpdated Dec 28, 2023 | 4:20 PM
చిట్టచివరికి ఐశ్వర్యరాయ్ వేరు కుంపటి!

మొత్తానికి బాంబే మీడియా ఎప్పటినుంచో రాస్తున్న వార్తలు నిజమయ్యాయి అంటున్నారు బాలీవుడ్ ప్రతినిధులు. ఏనాటి నుంచో వీరిపై సీరియల్ కథనాలు వస్తూనే ఉన్నాయి. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడిపోతున్నారు, విడాకులు తీసుకోబోతున్నారు అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అదిప్పుడు నిజమైనట్టుగా వార్తలు, కథనాలు బయటకు వస్తున్నాయి. ఏనాటి నుంచో అత్తగారు జయాబచ్చన్ కి, ఐశ్వర్యరాయ్ కి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని అక్కడివారు తెగ రాసుకుంటూ వచ్చారు. ప్రత్యక్షంగా చూసినట్టుగా కొంత, ఊహించి కొంత రాస్తూ వచ్చిన ఆ వార్తాకథనాలకు విపరీతమైన ప్రాచుర్యం వచ్చేసింది. కారణం బచ్చన్ కుటుంబానికి ఉన్న కీర్తిప్రతిష్టలే కారణం.

అయితే పెళ్ళయిన ఇన్నాళ్ళకి వాళ్ళ మధ్య ఈ ముసలం ఎలా పుట్టిందో, ఎందుకు పుట్టిందో కూడా కారణాలు మాత్రం ఇదమిద్ధంగా ఎవ్వరికీ తెలియలేదు. కానీ ఇదిగో తోక అంటే అదిగో పులి అనే రీతిలోనే రాసుకుంటూ వచ్చారు. కానీ అదే ఇప్పుడు నిజమై అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేసింది. అయితే కూతురు ఆరాధ్య గురించే ఇన్నాళ్ళూ అభిషేక్, రాయ్ ఇద్దరూ కలసి ఉన్నారని, కానీ వారిద్దరి మధ్యనా ఏమాత్రం సఖ్యత లేనే లేదని, కూతురు గురించైనా ఇద్దరూ కలిసి ఉండమని ఎందరు చెప్పినా కూడా వారింక ఒకే పంచన ఉండే అవకాశాన్ని జయాబచ్చనే దూరం చేశారని అంటున్నారు.

aishwarya rai and abhishek bachan

ఎన్నాళ్ళ నుంచో జయాబచ్చన్ కీ, ఐశ్వర్యరాయ్ కీ మధ్యన మాటా మంతి పోయి, చివరికి ఒకరి ప్రెజన్స్ ని మరొకరు భరించలేని స్థాయికి పరిస్థితి చేరుకుందనేది విశ్లేషణ. మొత్తానికి ఏదైతేనేం….ఐశ్వర్యరాయ్ ఇంటినుంచి వెళ్ళిపోయి వేరే కుంపటి పెట్టేసుకుందన్నది తాజా వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే రాయ్ తన పుట్టింటికి కూడా వెళ్ళిపోలేదట. వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయిందని, ఐశ్వర్యని గానీ, తన తల్లి జయను గానీ ఏమీ అనలేని అయోమయంలో అభిషేక్ మధ్యలో మౌనంగానే ఉండిపోయాడని బచ్చన్ కుటుంబానికి అతి సన్నిహితులైన వారు వ్యాఖ్యానిస్తున్నారు.

విడాకుల సీను మాత్రం లేదని, ఎందుకంటే ఎవరికివారు స్టార్స్ కావడంతో విడాకుల అపవాదను మాత్రం రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారనేది పరిశీలకుల వ్యాఖ్యానం. యాభై ఏళ్ళ వయసులో ఐశ్వర్యరాయ్ కి ఈ పరిస్థితిని మాత్రం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు.  మరి. ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ ల విషయంలో జరుగుతున్న ఈ పరిణామాలపై మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetlunabetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibom