iDreamPost
android-app
ios-app

హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

ఇండస్ట్రీలో వరుసగా హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రకుల్, కృతి కర్బంద, తాప్సీ పన్ను ఇప్పటికే పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. ఈ జాబితాలోకి చేరింది మరో హీరోయిన్.

ఇండస్ట్రీలో వరుసగా హీరోయిన్లు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రకుల్, కృతి కర్బంద, తాప్సీ పన్ను ఇప్పటికే పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. ఈ జాబితాలోకి చేరింది మరో హీరోయిన్.

హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి డేట్ ఫిక్స్..  ఎప్పుడంటే..?

కన్నడ ఇండస్ట్రీకి నుండి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి టాప్ హీరోగా ఎదిగిన నటుడు అర్జున్ సర్జా. మా పల్లెలో గోపాలుడుతో పక్కా పల్లెటూరి అబ్బాయి పాత్రలో మెప్పించాడు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడంతో యాక్షన్ కింగ్ అనే పేరు వచ్చింది. తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళ సినిమాలతో పాటు హిందీ చిత్రాలు చేశాడు. 1985 నుండి వరుసగా తెలుగులో సినిమాలు చేశారు. త్రిమూర్తులు, మొనగాడు, గర్జించిన గంగా, న్యాయానికి సంకెళ్లు వంటి సినిమాలు చేశారు. జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు వంటి అలాగే తమిళ డబ్బింగ్ సినిమాలతో స్టార్ హీరోగా మారాడు. ఇప్పుడు నెగిటివ్, అండ్ విలన్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాతగా మారి మూవీస్ తెరకెక్కిస్తున్నాడు. అర్జున్‌కు ఇద్దరు కూతుళ్లు అన్న సంగతి విదితమే.

పెద్ద కుమార్తె, నటి ఐశ్వర్యా సర్జా నిశ్చితార్థం గత ఏడాది జరిగింది. తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో గత ఏడాది అక్టోబర్ 27న తమిళనాడులో జరిగింది. కాగా, ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వీరి పెళ్లి డేట్, వెన్యూ కన్షమ్ అయినట్లు సమాచారం. ఇప్పుడు అర్జున్ కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. జూన్ 10న తమిళ, కన్నడ హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. పెళ్లి చెన్నైలోని పోరూర్‌లోని అంజనాసుత శ్రీ యోగాంజనేయ మందిరంలో వివాహం చేసుకోనున్నారని సమాచారం. ఈ పెళ్లి వేడుకలో బంధువులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారు. టాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది.

Aiswarya

ఇప్పటి అర్జున్, ఉమాపతి కుటుంబ సభ్యులు పెళ్లి పత్రికలు పంచడం, పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. కాగా, ఐశ్వర్య అర్జున్ 2103లో వచ్చిన పట్టాత్తు యానల్ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. కన్నడలో ప్రేమ బర్హ, తమిళంలో సొల్లివిడవ అనే చిత్రంలో నటించింది. తెలుగులో కూడా కూతుర్ని ఇంటర్యూస్ చేద్దామని ప్రయత్నించాడు యాక్షన్ కింగ్. తన నిర్మాణ సంస్థలో సినిమా స్టార్ చేశాడు. విశ్వక్ సేన్ హీరోగా, ఐశ్వర్య హీరోయిన్‌గా మూవీ షూటింగ్ స్టార్ అయ్యింది. కానీ ఊహించని విధంగా అర్జున్, విశ్వక్ మధ్య అభిప్రాయ బేధాలు వచ్చి.. ఇలా పట్టాలెక్కిన సినిమా.. అలా ఆగిపోయింది. ఇక ఐశ్వర్యకు కాబోయే భర్త.. ఉమాపతి కూడా తమిళంలో సినిమాలు చేస్తున్నాడు.  కాగా, అర్జున్.. తంబిల మధ్య స్నేహం.. ఇప్పుడు వియ్యంగా మారబోతుంది. అర్జున్ ప్రస్తుతం మూడు తమిళ ప్రాజెక్టులు చేస్తున్నాడు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbet güncel girişHoliganbet GirişMadridbetMadridbet giriş