iDreamPost

వీడియో: లాంచ్ కి ముందే అనుష్క చేతిలో వన్ ప్లస్ ఓపెన్ ఫోన్!

వీడియో: లాంచ్ కి ముందే అనుష్క చేతిలో వన్ ప్లస్ ఓపెన్ ఫోన్!

టెక్నాలజీకి సంబంధించి రోజుకో కొత్త పోన్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతూ ఉంది. ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా ఫోల్డింగ్, ఫ్లిప్ ఫోన్స్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అందుకే అన్ని కంపెనీలు కూడా ఈ ఫోన్లు తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. వన్ ప్లస్ తమ ఫోల్డ్ ఫోన్ ని భారత విపణిలోకి విడుదల చేసేందుకు రెడీ అయిపోయింది. అక్టోబర్ నెలలో వన్ ప్లస్ ఓపెన్ ని ఇండియాలో రిలీజ్ చేయనున్నారు. అయితే అంతకన్నా ముందే భారత్ లో వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ సోషల్ మీడియాని దున్నేస్తోంది. ఇప్పుడు ఆ మోడల్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వన్ ప్లస్ కంపెనీ ఇటీవలే క్రిప్టిక్ మెసేజ్ లో తాము వన్ ప్లస్ ఓపెన్ ఫోన్ ని ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఫోన్ అక్టోబర్ నెలలో విడుదల అవుతుందని చెబుతున్నారు. అంతకన్నా ముందే ఆ ఫోన్ ఇండియాలో తెగ వైరల్ అవుతోంది. అందుకు కారణం విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ అనే చెప్పాలి. విడుదల కంటే ముందే ఆ వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డింగ్ ఫోన్ అనుష్క శర్మ చేతిలో కనిపించింది. ఆమె ఫోన్ ని పట్టుకోవడం, ఓపెన్ చేయడం వీడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఇదంతా వన్ ప్లస్ కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీగా చెబుతున్నారు.

ఇప్పటివరకు ప్రమోషన్స్, సెలబ్రిటీ కొలాబరేషన్స్ చూశాం. కానీ, వన్ ప్లస్ ఈసారి కొత్తగా ట్రై చేసింది అంటున్నారు. ఎందుకంటే అనుష్క శర్మను చూస్తే కావాలని వీడియో ఆ ఫోన్ రావాలి అన్నట్లు ప్రవర్తించినట్లు కనిపించింది. రిలీజ్ కి ముందు తమ ఫోల్డింగ్ ఫోన్ పై బజ్ క్రియేట్ చేయడం కోసం వన్ ప్లస్ ఈ మార్కెటింగ్ స్ట్రాటజీని వాడినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే రొటీన్ కి భిన్నంగా వన్ ప్లస్ చేసిన ప్రయత్నానికి ప్రశంసలు కూడా అందుతున్నాయి. ఎందుకంటే బ్రాండ్స్.. సెలబ్రిటీలతో యాడ్స్ చేయడం కొత్తేం కాదు. అయితే అనుష్క శర్మతో చాలా కొత్తగా ఈ ప్రయత్నం చేశారు అంటూ చెబుతున్నారు. ఇంక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. దాదాపు రూ.1,25,000 వరకు ఉండచ్చని టెక్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.

వన్ ప్లస్ ఓపెన్ స్పెసిఫికేషన్స్:

  • 7.8 ఇంచెస్ ఆమోలెడ్ డిస్ ప్లే
  • 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్
  • కోర్నింగ్ గొరిల్లా గ్లాస్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2
  • ఆక్టాకోర్ ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ వీ13
  • ఆక్సిజన్ ఓఎస్
  • 50+48+32 ఎంపీ రేర్ కెమెరా
  • 32 ఎంపీ + 32ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4800 ఎంఏహెచ్ బ్యాటరీ
  • 12 జీబీ ర్యామ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి