iDreamPost

Agent Movie ఏజెంట్ కి యశోద సవాల్  

Agent Movie ఏజెంట్ కి యశోద సవాల్  

బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన క్లాష్ ఎదురు కాబోతోంది. అఖిల్ సమంతాలు ఒకే రోజు తమ రిలీజులతో తలపడనున్నారు. ఏజెంట్ ఆగస్ట్ 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చాలా రోజుల క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు యశోద కూడా అదే డేట్ కి లాక్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. రెండూ దాదాపుగా షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసుకుని కీలక షెడ్యూల్ లో ఉన్నాయి. వేర్వేరు జానర్లు అయినప్పటికీ ఏజెంట్ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం. అందులోనూ సైరా తర్వాత సురేందర్ రెడ్డి గ్యాప్ తీసుకుని మరీ ఈ స్క్రిప్ట్ కోసం కసరత్తులు చేశాడు. కొన్ని రీషూట్లు రిస్కీ ఎపిసోడ్లు అందులో ఉన్నాయి.

మమ్ముట్టి కీలక పాత్ర చేయడం ఇప్పటికే ఏజెంట్ మీద బజ్ ని పెంచింది. యాత్ర తర్వాత ఆయన మళ్ళీ టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ చేయలేదు. సంగీతం హిప్ హాప్ తమిజా అందిస్తున్నారు. ముందు తమన్ అనుకున్నారు కానీ దర్శకుడు సురేందర్ రెడ్డి ఎందుకో ధృవ మ్యూజిక్ డైరెక్టర్ నే తీసుకున్నారు. ఇక యశోద విషయానికి వస్తే శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో హరి అండ్ హరీష్ సంయుక్త దర్శకత్వంలో రూపొందుతోంది. ఇది డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ అనే టాక్ అయితే ఉంది. మణిశర్మ సంగీతం సమకూరుస్తుండగా అనసూయ, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వాస్తవానికి ఈ క్లాష్ పెద్ద సంగతేమీ కాదు కానీ చైతుతో విడాకులు అయ్యాక సమంతా యాక్టివ్ గా చేస్తున్న సినిమాల్లో యశోద ఒకటి. పుష్పలో ఐటెం సాంగ్ చేశాక తనది ఫుల్ లెన్త్ మూవీ ఏదీ రిలీజ్ కాలేదు. అందుకే దీని మీద గట్టి హోప్స్ పెట్టుకుంది. అయితే అన్ని విషయాల్లో పైచేయిగా కనిపిస్తున్న ఏజెంట్ మీద వెళ్లడం సాహసమే. ఈ నిర్ణయం నిర్మాతదే అయ్యుండొచ్చు కానీ సామ్ కి తెలియకుండా అయితే జరగదు. మరి మాజీ వదినతో అఖిల్ ఎలా అప్పర్ హ్యాండ్ తీసుకుంటాడో వేచి చూడాలి. ఆగస్ట్ 11న ప్లాన్ చేసుకున్న ఆది పురుష్ విడుదల వాయిదా పడటం ఖాయం కావడంతో ఆగస్ట్ లాక్ చేసుకుంటున్న రిలీజులు చాలానే ఉన్నాయి

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి