iDreamPost

పిచ్చి పబ్లిసిటీకి సోషల్ మీడియా తలంటు

పిచ్చి పబ్లిసిటీకి సోషల్ మీడియా తలంటు

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒక మ్యాగజైన్ కోసం ఇచ్చిన న్యూడ్ స్టిల్స్ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అతనేదో ఘనకార్యం చేసినట్టు స్ఫూర్తి చెంది తమిళంలో ఓ మోస్తరు ఇమేజ్ ఉన్న విష్ణు విశాల్ కూడా అదే తరహాలో ఫోజులివ్వడం విమర్శలకు దారి తీస్తోంది.

ఇది క్రమంగా ఇన్స్ పిరేషన్ గా తీసుకుని సోషల్ మీడియా వేదికగా యూత్ కూడా ఇలాంటి పిచ్చి పనులు చేసే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబై పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే పోలీస్ కేసులు నమోదు కావడం మొదలయ్యింది. మహిళల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా రణ్వీర్ సింగ్ నగ్నంగా ఫోటోలు దిగాడని వీటి మీద చర్యలు తీసుకోవాలని కంప్లయింట్ పెట్టారు.

నిజానికి సెలబ్రిటీలు ఏదైనా చేసే ముందు దాని ప్రభావం అభిమానులు సమాజం మీద ఎంత ఉంటుందనేది గుర్తు పెట్టుకోవాలి. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు చేస్తే దాని రీచ్ మహా అయితే వేలల్లో ఉంటుంది. కానీ అదే గుర్తింపు ఉన్న హీరో చేస్తే కోట్లలోకి వెళ్ళిపోతుంది. ఇది చాలా ప్రమాదం. నా శరీరం నా ఇష్టం అని అడ్డగోలు వాదన చేస్తే కోర్టులు కూడా చట్టం చెప్పిందే చేస్తామని చర్యలు తీసుకుంటుంది. రణ్వీర్, విష్ణు విశాల్ లు చేసింది లీగల్ గా పూర్తి తప్పు కాకపోయినా నైతికంగా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. రేపు మా బెడ్ రూమ్ మా ఇష్టం అంటూ సృష్టి కార్యాన్ని వీడియో తీసి పబ్లిక్ చేయలేరుగా. దాన్ని బ్లూ ఫిలిం అని బొక్కలో వేస్తారు.

విచిత్రంగా ఈ ట్రెండ్ కి మద్దతు ఇస్తున్న హీరోయిన్లు లేకపోలేదు అలియా భట్, స్వర భాస్కర్ అబ్బో అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చేశారు. అర్జున్ కపూర్ కూడా తప్పేముందనేలా ట్వీట్ చేశాడు. ఈ లెక్కన త్వరలో వెబ్ సిరీస్ లో బ్లర్ లేకుండా నేరుగా నగ్నంగా నటించే బ్యాచ్ లో రణ్వీర్, విష్ణు విశాల్ లాంటి వాళ్ళు ఉంటారేమో. లైగర్ పోస్టర్ లో విజయ్ దేవరకొండ పూలగుత్తి అడ్డు పెట్టుకుని పోస్టర్ దిగితే ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. అలాంటిది ఈ ఇద్దరినీ వదిలిపెడతారా. నెటిజెన్లు మాత్రం దుమ్మెత్తిపోస్తున్నారు. స్కూల్ కెళ్లే పిల్లలు వీటిని చూసి ఇన్స్ ఫైర్ అయితే ఎవరిది బాధ్యతని నిలదీస్తున్నారు. కోర్టులు ఏం చేస్తాయో చెప్పలేం కానీ ముందుగా తమను తాము ప్రశ్నించుకోవాల్సింది మాత్రం సదరు సెలెబ్రిటీలే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి