iDreamPost

పోలీస్ స్టేషన్‌లో ప్రేమ వివాహం! 12 ఏళ్ల ప్రేమ తరువాత ఊహించని ట్విస్ట్!

‘ప్రేమికులం మాది ప్రేమ కులం, మా ప్రేమను ఆపేదెవరు’ అంటూ పాటలు పాడుకున్నారు. ఒకటి కాదూ రెండేళ్లు కూాడా కాదూ.. పుష్కర కాలం లవ్ లో ఉన్నారు. అంతలో ఊహించని ట్విస్ట్.. ప్రియురాలు ఏం చేసిందంటే..?

‘ప్రేమికులం మాది ప్రేమ కులం, మా ప్రేమను ఆపేదెవరు’ అంటూ పాటలు పాడుకున్నారు. ఒకటి కాదూ రెండేళ్లు కూాడా కాదూ.. పుష్కర కాలం లవ్ లో ఉన్నారు. అంతలో ఊహించని ట్విస్ట్.. ప్రియురాలు ఏం చేసిందంటే..?

పోలీస్ స్టేషన్‌లో ప్రేమ వివాహం! 12 ఏళ్ల ప్రేమ తరువాత ఊహించని ట్విస్ట్!

ప్రేమ కోసం ఒకరి కోసం ఒకరు చనిపోవడానికి సిద్ధపడుతుంటారు ప్రేమికులు. తమ ప్రేమను సఫలీకృతం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. తల్లిదండ్రులు తమ ఇష్క్‌ను అంగీకరించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని సార్లు పరిస్థితులకు తలొగ్గి.. ప్రేమించిన వ్యక్తులను వదులుకునేందుకు కూడా రెడీ అవుతుంటారు. కుటుంబ సభ్యుల కోసం తమ ప్రేమను త్యాగం చేయడానికి కూడా వెనుకాడరు. అలా ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ప్రేమించిన యువతిని పెళ్లాడేందుకు నిరాకరించాడు. కానీ ఆ యువతి లవ్వర్ కే ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది.  ఆమె చేసిన పనికి అతడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది.

మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని జమ్నా రోడ్ ప్రాంతానికి చందిన అవినాష్ గోయల్, అర్చన గత 12 ఏళ్ల నుండి ప్రేమించుకుంటున్నారు. నువ్వు లేకపోతే నేను లేను అనుకున్నారు. కట్ చేస్తే.. వీరి ప్రేమను కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో.. ఈ పెళ్లి ఇక జరగదని.. తనను మర్చిపోవాలంటూ ప్రియురాలికి ప్రియుడు చెప్పాడు. దీంతో తట్టుకోలేక అర్చన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవినాష్‌తో పాటు కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు పోలీసులు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్‌ లోనే ఇద్దరికీ పెళ్లి చేశారు. భోలేనాథ్ ఆలయానికి తీసుకెళ్లి ఇతర వివాహ కార్యక్రమాలు పూర్తి చేశారు. వెంటనే వారిపై పూల వర్షం కురిపించి.. ఆశీర్వదించారు పోలీసులు. సినిమా రేంజ్ లో  ప్రియుడికి ఝలక్ ఇచ్చింది ప్రియురాలు.

అర్చన తన ప్రేమికుడు తనను పెళ్లి చేసుకోనని చెప్పకపోవడంతో తట్టుకోలేకపోయింది. 12 ఏళ్లు ప్రేమించుకున్నాక.. ఇప్పుడు పెళ్లి చేసుకోననడాన్ని సబబు కాదంటూ..ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.అక్కడ తన గోడంతా వెళ్లి బుచ్చుకుంది. దీంతో పోలీసులు అవినాష్‌తో పాటు కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. ఎట్టకేలకు వారి కౌన్సిలింగ్‌తో ప్రియుడు అంగీకరించడంతో.. వెంటనే పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోని భోలేనాథ్ ఆలయానికి తీసుకెళ్లారు, అక్కడ వివాహాన్నిచేశారు. పెళ్లి తర్వాత కూడా వధువు అర్చన తన అసంతృప్తిని దాచుకోలేకపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ రకంగా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, కానీ పరిస్థితుల వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పింది. మరీ ఈ పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్  రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి