iDreamPost

10th త‌ర్వాత బెస్ట్‌ ITI కోర్సులు.. లైఫ్ లో త్వరగా సెట్ అయిపోవచ్చు!

  • Published Apr 06, 2024 | 3:37 PMUpdated Apr 06, 2024 | 3:37 PM

ITI Course: పదో తరగతి తర్వాత ఈ కోర్సులో చేరితో త్వరగా జాబ్ రావడం మాత్రమే కాక మంచి వేతనం కూడా పొందవచ్చు. ఆ వివరాలు..

ITI Course: పదో తరగతి తర్వాత ఈ కోర్సులో చేరితో త్వరగా జాబ్ రావడం మాత్రమే కాక మంచి వేతనం కూడా పొందవచ్చు. ఆ వివరాలు..

  • Published Apr 06, 2024 | 3:37 PMUpdated Apr 06, 2024 | 3:37 PM
10th త‌ర్వాత బెస్ట్‌ ITI కోర్సులు.. లైఫ్ లో త్వరగా సెట్ అయిపోవచ్చు!

విద్యార్థి జీవితంలో పదో తరగతి చాలా కీలకం. టెన్త్ క్లాస్ అనేది ఫౌండేషన్ లాంటిది. ఇక మరి కొద్ది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు వెల్లడి కానున్నాయి. చాలా మంది ఇంటర్ లో ఎంపీసీ, బైపీసీ ఈ కోర్సులకు ఓటు వేస్తారు. కానీ పదో తరగతి తర్వాత చాలా కోర్సులు అందుబాటులో ఉంటాయి. వీటిలో కొన్ని త్వరగా జీవితంలో సెటిల్ అయ్యేందుకు సాయం చేస్తాయి. కానీ తల్లిదండ్రులకు, విద్యార్థులకు వాటి గురించి పెద్దగా తెలియదు. అందుకే మీ కోసం ఈ వార్త. పదో తరగతి తర్వాత ఏ కోర్సులో జాయిన్ అయితే త్వరగా లైఫ్లో సెటిల్ అవుతారు.. వాటికి భవిష్యత్తు ఎలా ఉండనుంది అనే వివరాలు మీ కోసం..

పదో తరగతి తర్వాత ఐటీఐ కోర్సులో చేరితో.. త్వరగా జీవితంలో సెటిల్ కావచ్చు అంటున్నారు నిపుణులు. చాలా మంది ఈ ఐటీఐ కోర్సులు చేసిన వాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ పరిధిలోని పలు సంస్థల్లో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. గరిష్టంగా నెలకు 90 వేల రూపాయల వరకు వేతనం పొందవచ్చు అంటున్నారు నిపుణలు. మరి ఈ కోర్సులో చేరాలంటే ఏం చేయాలంటే..

ఐటీఐ కోర్సుల్లో ప్ర‌వేశం ఎలా…

ఇండస్ట్రియల్ సెక్టార్‌లో నిపుణుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించి ప్రభుత్వం ఐటీఐ కోర్సు తీసుకువచ్చింది. పదో తరగతి చదివిన వాళ్లెవరైనా ఇందులో చేరేందుకు అర్హులు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఐటీఐలో చేరిపోవచ్చు. పదోతరగతిలో సాధించిన మార్కుల‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ఐటీఐ చేయాలనుకునే విద్యార్థుల‌కు.. దేశవ్యాప్తంగా 130కిపై కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక ఆధారంగా వీటి వ్యవధి ఏడాది, రెండేళ్లుగా ఉంటుంది. ఇంజనీరింగ్‌తో పాటు నాన్ ఇంజనీరింగ్ విభాగంలోనూ ఐటీఐ కోర్స్ చేసేందుకు వీలుంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా ప్రత్యేక కోర్సులు..

ఇక ఐటీఐకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో 50కి పైగా స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థి ఆసక్తి మేరకు ఏడాది లేదా రెండేళ్ల కోర్స్‌లను ఎంపిక చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, వెల్డర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్ వంటి తదితర కోర్స్‌ల వ్యవధి ఒక సంవత్సర కాలంగా ఉంటే.. ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, కెమికల్ ప్లాంట్‌లో ఆపరేటర్ తరహా కోర్స్‌ల వ్యవధి రెండేళ్లుగా ఉంటుంది.

ఇంజనీరింగ్ కూడా చేయవచ్చు..

ఐటీఐ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి. అలా కాకుండా ఇంకా ఉన్నత చదువులు చదవాలనుకునే వారి కోసం డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు లేటరల్ ఎంట్రీతో కొన్ని బ్రాంచ్‌లలో డిప్లొమా సెకండ్ ఇయర్‌లో జాయిన్ అవచ్చు. డిప్లొమా త్వ‌రాత‌ ఈసెట్ ఎగ్జామ్ రాసి బీటెక్ కోర్సులో.. నేరుగా సెకండ్ ఇయర్‌లో చేరే అవకాశం కల్పిస్తున్నారు.

పీఎస్‌యూ సంస్థల్లో ఉద్యోగాలు..

ఐఐటీ కోర్సు పూర్తి చేసిన వాళ్లు నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల్లో శిక్షణ తీసుకోవచ్చు. అప్రెంటిస్‌ చేసిన వాళ్లకు పలు సంస్థల్లో ప్రాధాన్యత ఉంటుంది. నవరత్న, మహారత్న లాంటి పీఎస్‌యూ సంస్థల్లో వీరికి అప్రెంటిస్ అవకాశాలు కల్పిస్తున్నారు. అలానే రైల్వేలోనూ అప్రెంటిస్‌ల్ గా అకాశాలు లభిస్తున్నాయి.

ప్రైవేటు సంస్థల్లో..

ఐటీఐ పూర్తి చేసిన వారికి దేశవ్యాప్తంగా పలు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. వాటిల్లో కియా, హుండాయి, మారుతి, హరీ మోటార్స్‌ లాంటి ఆటోమొబైల్‌ కంపెనీలతో పాటు అన్ని రంగాల్లో కూడా ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో నిపుణులైన వారికి ఉద్యోగ అవకాశాలున్నాయి. కారు, బైక్‌ మెకానిక్, నిర్మాణరంగంలో ఫిట్టింగ్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో పనిచేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. ఇటీవల ఈ రంగాల్లో పని నేర్చుకునే ఆసక్తి తగ్గుతోంది. కనుకు ఐటీఐ చేసే వారికి మంచి డిమాండ్ ఉండనుంది.

అలాగే ఐటీఐ విద్యార్థుల‌కు..

  • విద్యుత్ రంగంలో లైన్‌మెన్ ఉద్యోగాలు.
  • ఎలక్ట్రికల్ కోర్స్ చేసిన వాళ్లు జూనియర్ లైన్‌మెన్‌ పోస్ట్‌లు.
  • స్టీల్‌ప్లాంట్‌లు, పోర్ట్‌ల్లోనూ ఉద్యోగ అవకాశాలు.
  • ఇదే కాకుండా స్వయం ఉపాధి కూడా పొందొచ్చు.
  • కొన్ని సంస్థలు సర్టిఫికెట్‌లు అందించి ఐటీఐ చేసిన వాళ్లను అవసరాల ఆధారంగా విదేశాలకూ పంపుతున్నాయి.

ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు స్కిల్డ్‌ వర్కర్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎన్‌ఎస్‌డీసీ(నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) కూడా ఇదే విషయాన్ని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోనే వచ్చే నాలుగేళ్లలో 41.41 లక్షల మంది స్కిల్డ్‌ వర్కర్ల అవసరం ఉండబోతుండగా.. ఏడాదికి కేవలం 2.85 లక్షల మందే అందుబాటులో ఉంటున్నారు.

స్వయం ఉపాధి ఇలా..

మెకానిక్‌ నుంచి ఎలక్ట్రికల్, ఫిట్టర్ల వరకూ అసిస్టెంట్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎలక్ట్రిషియన్‌ కొత్త ఇంటికి కరెంట్‌ పని చేస్తే 2–4 రోజుల్లో పూర్తవుతుంది. దీనికి రూ.15-20 వేలు తీసుకుంటున్నారు. అలానే బైక్‌ మెకానిక్, ఫిట్టర్లు కూడా రోజూ కనీసం రూ.3వేలు తక్కువ కాకుండా సంపాదిస్తారు. అంటే వీరి సంపాదన కూడా నెలకు రూ.90 వేలకుపైనే అన్న మాట. రెండు సంవత్సరాల కోర్సుతో లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటే.. ఐటీఐ బెస్ట్ అంటున్నారు నిపుణులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి