iDreamPost

ఎమ్మెల్యే ఇంట్లో విషాదం.. పూజ చేస్తుండగా..

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇంట్లో విషాదం నెలకొంది. ఊహించిన ప్రమాదం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. సుమారు వారం రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ.. ఆ ఇంటిలోని ఓ సభ్యురాలు కానరాని లోకాలకు వెళ్లిపోయింది.

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఇంట్లో విషాదం నెలకొంది. ఊహించిన ప్రమాదం ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది. సుమారు వారం రోజుల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ.. ఆ ఇంటిలోని ఓ సభ్యురాలు కానరాని లోకాలకు వెళ్లిపోయింది.

ఎమ్మెల్యే ఇంట్లో విషాదం.. పూజ చేస్తుండగా..

ఆనందంగా గడిచిపోతున్న జీవితంలో చిన్న చిన్న సమస్యలు కాస్త ఇబ్బంది అనిపించినా.. వాటిని అధిగమంచొచ్చన్న ధీమా ఉంటుంది. కానీ ఊహించని ప్రమాదాలు జరిగి.. ఇంట్లో ఎవరినైనా కోల్పోవాల్సి వస్తే.. ఆ బాధ చెప్పలేనిది. ఇప్పుడు అదే జరిగింది ఆ నాయకుడి కుటుంబంలో. అన్నాడీఎంకే మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేపీ అన్పళగన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన కోడలు పూర్ణిమ ఊహించని విధంగా ప్రమాదం బారిన పడి.. మృతి చెందారు. పూజ చేసుకుంటుండగా.. చీరకు అంటుకుని అగ్ని ప్రమాదానికి గురైంది పూర్ణిమ. కాలిన గాయాలతో వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో గురువారం ఉదయం మరణించింది. ఆమెకు ఓ చిన్నారి కూడా ఉన్నాడు. ఆ బిడ్డను ఒంటరిని చేసి కానరాని లోకాలకు తరలివెళ్లిపోయింది.

అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ ఉన్నత విద్యా శాఖ మంత్రి అన్బళగన్ చిన్న కుమారుడు ఎ శశిమోహన్‌తో పూర్ణిమకు 2019లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ ధర్మపురి జిల్లాలోని పాలకోడ్ గ్రామంలో నివాసం ఉంటున్నారు. జనవరి 18న పూజా గదిలో దీపం వెలిగిస్తున్న సమయంలో ఆమె పట్టు చీరకు మంటలు అంటుకున్నాయి. తొలుత పూర్ణిమ గమనించలేదు. మంటలు మొత్తం వ్యాపించే సరికి ఆమె కంగారుతో కేకలు వేసింది. ఇంట్లో పనిమనిషి ఆమెను రక్షించేందుకు పరుగులు పెట్టింది. మంటలు ఆర్పేసినప్పటికీ.. అప్పటికే శరీరం నిండా మంటలు అలముకున్నాయి. తీవ్ర గాయాలతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.

Ex minister KP anbalagan daughter died

ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. 83.5 శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. తొలుత ధర్మపురిలోని ఓ ఆసుపత్రికి తరలించారు.  అక్కడ ప్రాథమిక చికిత్స అందించాక..  అదే రోజు ప్రైవేట్ ఆసుపత్రి వేలూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్ ఆశిష్ గుప్తా నేతృత్వంలోని నిపుణుల బృందం ఆమెకు ప్రత్యేక చికిత్స అందించారు. చికిత్స అందించినప్పటికీ..ఉపయోగం లేకుండా పోయింది. జనవరి 25న చికిత్స పొందుతూ మరణించింది. ధర్మపురిలోని పాలకోడ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి