iDreamPost

ఆదిపురుష్‌ ఎఫెక్ట్‌.. వెనకడుగేస్తున్న సినిమాలు!

సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు విడుదలైన ట్రైలర్‌లో మంచి అవుట్‌ పుట్‌ వచ్చింది. ఇక, ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌ ఎఫెక్ట్‌ కారణంగా మిగిలిన సినిమాలు కూడా ఆలోచనల్లో పడ్డాయి.

సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు విడుదలైన ట్రైలర్‌లో మంచి అవుట్‌ పుట్‌ వచ్చింది. ఇక, ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌ ఎఫెక్ట్‌ కారణంగా మిగిలిన సినిమాలు కూడా ఆలోచనల్లో పడ్డాయి.

ఆదిపురుష్‌ ఎఫెక్ట్‌.. వెనకడుగేస్తున్న సినిమాలు!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ రాముడిగా తెరకెక్కిన ‘ ఆదిపురుష్‌’ సినిమా గ్రాఫిక్స్‌ విషయంలో ఎంతటి ట్రోలింగ్‌కు గురైందో తెలిసిందే. సినిమాకు సంబంధించిన ట్రైలర్‌లో గ్రాఫిక్స్‌ కార్టూన్‌ నెట్‌వర్క్‌లో బొమ్మల్లా ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో భీభత్సమైన ట్రోలింగ్‌ ఎదురైంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా గ్రాఫిక్స్‌పై మండిపాటు వ్యక్తం చేశారు. 500 కోట్ల బడ్జెట్‌తో చిన్న పిల్లల సినిమా తీస్తున్నారా? అంటూ దర్శకుడిపై మండిపడ్డారు. తర్వాత తన తప్పు తెలుసుకున్న దర్శకుడు ఓం రౌత్‌ గ్రాఫిక్స్‌ మళ్లీ రీఎడిట్‌ చేయించాడు.

సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు విడుదలైన ట్రైలర్‌లో మంచి అవుట్‌ పుట్‌ వచ్చింది. ఇక, ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌ ఎఫెక్ట్‌ కారణంగా మిగిలిన సినిమాలు కూడా ఆలోచనల్లో పడ్డాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్‌తో తెరకెక్కుతున్న తెలుగు సినిమాలు ఒకటికి రెండు సార్లు గ్రాఫిక్స్‌ విషయంలో ఆలోచనలు చేస్తున్నాయి. టాలీవుడ్‌లోని చిన్న – మధ్య స్థాయి సినిమాలు వీఎఫెక్ట్స్‌ విషయంలో జరుగుతున్న ట్రోలింగ్స్‌ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. ఆది పురుష్‌ ఎఫెక్ట్‌ కారణంగా తమ సినిమాలు పోస్ట్‌ పోన్‌ చేసుకుంటున్నాయి.

డెవిల్‌, ఊరిపేరు భైరవ కోన సినిమాలు గ్రాఫిక్స్‌ విషయం కారణంగా పోస్టు అయ్యాయని తెలుస్తోంది. సినిమా టీం వీలైనంత ఎక్కువ భాగాన్ని వీఎఫెక్ట్స్‌ కోసం వాడుతున్నాయట. గ్రాఫిక్స్‌ విషయంలో ప్రేక్షకులు సినిమాలోని ప్రతీ విషయాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తారన్న కారణంతో వెనకడుగువేస్తున్నారట. మరి, ఆదిపురుష్‌ ఎఫెక్ట్‌ కారణంగా గ్రాఫిక్స్‌ విషయంలో తెలుగు సినిమాలు వెనకడుగు వేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి