iDreamPost

Adipurush, Brahmastra : బాక్సాఫీస్ విజయానికి, పౌరాణిక కథల్లో బాలీవుడ్ పెట్టుబ‌డులు

ర్ఆర్ఆర్, కేజీఎఫ్ తో దక్షిణాది చిత్రాల దెబ్బ‌కు బాలీవుడ్ మ‌స‌క‌బారింద‌ని, హిందీ మ‌ర్కెట్ ను సౌత్ కు అప్ప‌గించేసింద‌న్న క‌థ‌నాల మ‌ధ్య‌, బాలీవుడ్ మ‌ళ్లీ త‌లెత్తుకోవ‌డానికి పౌరాణికాలను న‌మ్ముకుంది.

ర్ఆర్ఆర్, కేజీఎఫ్ తో దక్షిణాది చిత్రాల దెబ్బ‌కు బాలీవుడ్ మ‌స‌క‌బారింద‌ని, హిందీ మ‌ర్కెట్ ను సౌత్ కు అప్ప‌గించేసింద‌న్న క‌థ‌నాల మ‌ధ్య‌, బాలీవుడ్ మ‌ళ్లీ త‌లెత్తుకోవ‌డానికి పౌరాణికాలను న‌మ్ముకుంది.

Adipurush, Brahmastra : బాక్సాఫీస్ విజయానికి, పౌరాణిక కథల్లో బాలీవుడ్ పెట్టుబ‌డులు

యాక్ష‌న్ సినిమాలు, రొమాంటిక్ సినిమాల నుంచి బాలీవుడ్ పౌరాణికాల వ‌ర‌కు వ‌చ్చింది. అక్షయ్ కుమార్ రామసేతు నుండి రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర వరకు, పౌరాణిక క‌థ‌ల‌ను తెర‌కెక్కించ‌డానికి వంద‌ల కోట్ల‌ను ఖ‌ర్చుచేయ‌డానికి బాలీవుడ్ నిర్మాత‌లు రెడీ. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ తో దక్షిణాది చిత్రాల దెబ్బ‌కు బాలీవుడ్ మ‌స‌క‌బారింద‌ని, హిందీ మ‌ర్కెట్ ను సౌత్ కు అప్ప‌గించేసింద‌న్న క‌థ‌నాల మ‌ధ్య‌, బాలీవుడ్ మ‌ళ్లీ త‌లెత్తుకోవ‌డానికి పౌరాణికాలను న‌మ్ముకుంది. వ‌ర‌స‌పెట్టి సినిమాలు తీర్చిదిద్దుతోంది. సౌత్ యాక్ష‌న్ మూవీస్ ను పౌరాణిక సినిమాల‌తో ఢీకొడుతోంది.

ఆదిపురుష్ Adipurush

ఇండియాలోనే బిగ్గెస్ట్ సూప‌ర్ స్టార్ ప్ర‌భాస్ తో ఆదిపురుష్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్త‌య్యింది. పోస్ట ప్రొడ‌క్ష‌న్ న‌డుస్తోంది. వ‌చ్చే యేడాదే రిలీజ్. ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ , సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు, ఇది రాముడు- రావణుల కథ ఆధారంగా రూపొందించబడింది. అదీకూడా హాలీవుడ్ స్థాయిలో. ఇక్క‌డ రాముడు మంచిబాలుడుకాదు. గొప్ప‌వీరుడు. కండ‌లు తిరిగిన దేహంతో మార్వెల్స్ రేంజ్ లో యాక్ష‌న్ చేస్తాడంట‌.


బ్ర‌హ్మాస్త్ర Brahmastra

రణబీర్ కపూర్- అలియా భట్ ఈ సినిమాకు తమ ఐదేళ్ల సుదీర్ఘ సమయాన్ని కేటాయించారు. ఈ సినిమాలో ఉండ‌గానే ప్రేమ‌పుట్టింది. పెళ్లి అయ్యింది. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదలకు రెడీ. నాగార్జున కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ను పోషించారు. బ్రహ్మాస్త్ర ట్రైలర్ , పాటలు విజువల్ ట్రీట్ అనుకోవాలి. బాక్సాఫీస్ వద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురుస్తుంద‌న్న‌ది బాలీవుడ్ ట్రేడ్ ఆశ‌.

రామసేతు Ram Setu
ఈ సినిమాకు నేప‌థ్యం రామాయ‌ణం. అక్షయ్ కుమార్ నటించిన రామ్ సేతు, వాన‌ర సేన‌ నిర్మించిన వంతెన చుట్టూ తిరుగుతుంది. రావ‌ణుడి చెర‌లో ఉన్న సీత‌ను ర‌క్షించ‌డానికి ఈ సేతుమీద‌నే శ్రీలంక వెళ్లాడ‌ని రామాయ‌ణం చెబుతోంది. రామ్ సేతు ఫస్ట్ లుక్ చాలామందిని ఎగ్జైట్ చేసింది. ఇంత‌వ‌ర‌కు ఇండియ‌న్ స్క్రీన్ మీద క‌నిపించ‌ని కొత్త పాయింట్ కాబ‌ట్టి, బాలీవుడ్ ఆశ‌లు పెట్టుకోవ‌డంలో త‌ప్పులేదు.

అశ్వత్థామ: అమ‌రుడు Ashwatthama: The Immortal
అశ్వత్థామ: ది ఇమ్మోర్టల్- విక్కీ కౌశల్ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్. ఈ పౌరాణిక చిత్రంతో ఎప్ప‌టికీ మ‌రణంలేని అమ‌రుడు అశ్వ‌త్థామ‌ మాయాజాలాన్ని స్క్రీన్ మీద చూడ‌టం ఒక గొప్ప అనుభ‌వ‌మే.


మహాభారతం Mahabharata
బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ , దీపికా పదుకొణెలతో ప్రారంభం కానున్న ఈ మ‌హాభార‌తం భారీ బ‌డ్జెట్ సినిమాల త‌ల‌ద‌న్నెలా రానుందంట‌. ద్రౌపది పాత్రను దీపికా పోషించ‌నుంది. అంటే మ‌హాభార‌తాన్ని ద్రౌప‌ది కోణంలో చూపించ‌నున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి