iDreamPost

MLA, ఐఏఎస్ పెళ్లి.. 3 నగరాల్లో రిసెప్షన్, 3 లక్షల మందికి ఆహ్వానాలు

  • Published Dec 09, 2023 | 10:56 AMUpdated Dec 09, 2023 | 10:56 AM

సాధారణంగా పెళ్లి అంటే వందలు, వేల సంఖ్యలో బంధువులు వస్తారు. కానీ లక్షల మంది అతిథులు రావడం గురించి ఎప్పుడైనా విన్నారా లేదా.. అయితే ఇది చదవండి.

సాధారణంగా పెళ్లి అంటే వందలు, వేల సంఖ్యలో బంధువులు వస్తారు. కానీ లక్షల మంది అతిథులు రావడం గురించి ఎప్పుడైనా విన్నారా లేదా.. అయితే ఇది చదవండి.

  • Published Dec 09, 2023 | 10:56 AMUpdated Dec 09, 2023 | 10:56 AM
MLA, ఐఏఎస్ పెళ్లి.. 3 నగరాల్లో రిసెప్షన్, 3 లక్షల మందికి ఆహ్వానాలు

సాధారణంగా పెళ్లి అంటే.. బంధువులు, స్నేహితులు కోలాహలం మాములే. వివాహం సందర్భంగా మాములు జనాలైతే.. 1000-2000 మందిని పిలుస్తారు. బాగా డబ్బున్న వాళ్లు అయితే ఈ ఆహ్వానాల లెక్క మారుతుంది. ఇక బిలియనీర్లు అయితే.. ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖులను కూడా ఆహ్వానిస్తుంటారు. అయితే ఎంత ఘనంగా చేసుకున్నా.. సరే పెళ్లికి లక్షల మందిని ఆహ్వానించడం మాత్రం ఇంతవరకు ఎక్కడా జరిగి ఉండదు. మనం కూడా వినలేదు. కానీ తాజాగా ఓ పెళ్లికి ఏకంగా 3 లక్షల మందిని ఆహ్వానించి.. రికార్డు క్రియేట్ చేశారు కాబోయే దంపతులు. వారేం సాధారణ వ్యక్తులు కాదు. వరుడు ఎమ్మెల్యే కాగా.. వధువు కలెక్టర్. వారి పెళ్లి కోసం 3 లక్షల మందిని ఆహ్వానించి అందరి చూపు తమవైపు తిప్పుకున్నారు. ఆ వివరాలు..

హర్యాణా మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. త్వరలోనే ఓ ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 22 వ తేదీన వీరి పెళ్లి జరగనుంది. ఈ క్రమంలోనే హర్యాణా, రాజస్థాన్ రెండు రాష్ట్రాలకు ఆహ్వానాలు అందాయి. వీరి వివాహం సందర్భంగా ఏకంగా 3 నగరాల్లో మూడు రిసెప్షన్లను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు 3 లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి. సుమారు 80 గ్రామాలకు చెందిన వారిని.. ఈ వివాహ వేడుకకను ఆహ్వానించనున్నారు. ప్రస్తుతం నెట్టింట వీరి పెళ్లి వేడుక వివరాలు వైరల్ గా మారాయి.

MLA IAS marriage

వరుడి విషయానికి వస్తే.. అతడు హర్యాణా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్. భవ్య బిష్ణోయ్ తండ్రి బీజేపీ నేత, మాజీ ఎంపీ. ప్రస్తుతం భవ్య బిష్ణోయ్ అదంపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆయన వివాహం చేసుకోబోయే మహిళ, ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్‌. ఆమె స్వస్థలం రాజస్థాన్‌. 2019 లో సివిల్స్‌‌ పాస్ అయిన పరి బిష్ణోయ్.. సిక్కిం క్యాడర్‌ కింద గ్యాంగ్‌టక్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. భవ్య బిష్ణోయ్ కు గతంలో.. హీరోయిన్ మెహ్రీన్ తో 2021లో నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్ని నెలలకు అది రద్దయ్యింది.

ఆ తర్వాత.. ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్‌కి, ఐఏఎస్‌ అధికారిణి పరి బిష్ణోయ్‌తో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. పరి బిష్ణోయ్ సొంత రాష్ట్రమైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఇక పుష్కర్, అదంపూర్, ఢిల్లీ మూడు నగరాల్లో 3 రిసెప్షన్‌లు ఏర్పాటు చేశారు. అయితే ఈ పెళ్లి, రిసెప్షన్‌ల కోసం హాజరయ్యేందుకు 3 లక్షల మందికి ఆహ్వానాలు వెళ్లనున్నాయి. ఢిల్లీలో నిర్వహించనున్న రిసెప్షన్‌కు బీజేపీ సీనియర్ నేతలు, ప్రముఖులు హాజరవుతారని కుల్ దీప్ బిష్ణోయ్ వెల్లడించారు.

ఇక భజన్‌లాల్ కాలం నుంచి అదంపుర్‌ నియోజకవర్గం బిష్ణోయ్ కుటుంబానికి కంచు కోట లాగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్క అదంపూర్ నియోజకవర్గంలోని 80 కి పైగా గ్రామాలకు చెందిన ప్రజలను ఆహ్వానిస్తామని భవ్య బిష్ణోయ్ తండ్రి కుల్‌దీప్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన పెళ్లి సమయంలో కూడా తన తండ్రి భజన్‌లాల్ అదంపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు తిరిగి ప్రజలను ఆహ్వానించినట్లు చెప్పారు. ఆ సమయంలో తన తండ్రి హర్యాణా సీఎంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కూడా తాను అదే చేయబోతున్నట్లు కుల్ దీప్ బిష్ణోయ్ చెప్పారు. ఏది ఏమైనా ప్రస్తుతం వీరి వివాహ వేడుక మాత్రం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి