iDreamPost

వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ యాక్టర్ కాదు.. ఎమోషనలైన వితికా షేరు

హ్యాపీడేస్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కుర్రాడు వరుణ్ సందేశ్. అతడు ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్లు అవుతుంది. తాాజాగా నింద అనే మూవీ చేయగా.. ఈ నెల 21న విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. సందేశ్ భార్య వితికా కూడా వచ్చింది. ఆమె మాట్లాడుతూ..

హ్యాపీడేస్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కుర్రాడు వరుణ్ సందేశ్. అతడు ఇండస్ట్రీలోకి వచ్చి 17 ఏళ్లు అవుతుంది. తాాజాగా నింద అనే మూవీ చేయగా.. ఈ నెల 21న విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. సందేశ్ భార్య వితికా కూడా వచ్చింది. ఆమె మాట్లాడుతూ..

వరుణ్ సందేశ్ ఫెయిల్యూర్ యాక్టర్ కాదు.. ఎమోషనలైన  వితికా షేరు

టాలీవుడ్ ఇండస్ట్రీల్లో క్యూట్ కపుల్స్‌లో ఒకరు వరుణ్ సందేశ్ అండ్ వితికా షేరు. వరుణ్ సందేశ్ కాస్తంత ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్నా.. వితికా స్వయం కృషితో ఎదిగిన నటి. పడ్డానండి ప్రేమలో మరీ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి.. పెద్దల అంగీకారంతో 2016లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి వితిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వ్యవహరిస్తుంది. ఇటు భర్త బాధ్యతలు, యూట్యూబ్ చానల్, ఇంటిని చక్కదిద్దుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక వరుణ్ సందేశ్ హ్యాపీడేస్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు నింద అనే మూవీ చేస్తున్నాడు. యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించాడు దర్శక, నిర్మాత రాజేశ్ జగన్నాథం.

జూన్ 21న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ హీరో, హ్యాపీడేస్‌తో తనతో పాటు నటించిన నిఖిల్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. అలాగే ఈవెంట్‌కు వితికా కూడా వచ్చి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘ఎప్పుడు సందేశ్ ఫంక్షన్స్ జరిగినా.. నేను రాను నువ్వు వెళ్లు అని చెప్పేదాన్ని..కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత మా ఆయన కోసం ఇక్కడకు రావాలనిపించింది. నింద సినిమా గురించి వరుణ్ చాలా ఇంటర్వ్యూలో, ప్రమోషన్లలో పాల్గొని ఇంటికి వచ్చి నాతో కొన్ని విషయాలు పంచుకుంటున్నాడు. కొందరు. ‘మీరు చాలా ఫెయిల్యూర్స్ చూశారు కదా.. ఫెయిల్యూర్ యాక్టర్‌గా ఉన్నారు కదా.. అవకాశాలు రావడం లేదు కదా’ అని ప్రశ్నిస్తున్నారు.

కానీ వరుణ్ ఫెయిల్డ్, ఫెయిల్యూర్ యాక్టర్ కాదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ల నుంచి ఎన్నో చిత్రాల్లో నటించారు. పదేహేడేళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఎవరైతే అన్ని సర్దుకుని వెళ్లిపోతారో, సినిమాలు వద్దు అని పరిశ్రమ నుంచి వెళ్లిపోయిన వాళ్లను ఫెయిల్యూర్‌ యాక్టర్‌ అంటారు.ఇండస్ట్రీనే నమ్ముకుని ఇక్కడ వరకు వరుణ్ వచ్చాడు. ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దానికి కారణం డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. వారికి థాంక్యూ సోమచ్. ప్రతీ చిత్రానికి 100 శాతం న్యాయం చేస్తాడు. సక్సెస్ అవ్వాలని సినిమా చేస్తారు.. వరుణ్ కూడా అంతే. ‘నింద’ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అలాగే ఈవెంట్‌కు విచ్చేసిన నిఖిల్‌కు థాంక్యూ.. సందేశ్ ఎవరినైనా పిలవాలంటే..ఎందుకులే వస్తారో లేదో అని అన్నాడు. కాదు పిలువు అన్నప్పుడు అతడికి గుర్తుకు వచ్చిన మొదటి వ్యక్తి నిఖిల్. వరుణ్ లైఫ్‌లో నిఖిల్.. నిఖిల్ లైఫ్‌లో వరుణ్ ఉండాలని కోరుకుంటున్నా’ అని ఎమోషనల్ అయ్యింది వితిక.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి