iDreamPost
android-app
ios-app

నన్ను మోసం చేశాడు.. ఆ నేతను అరెస్ట్ చేయండి: ‘హనుమాన్ జంక్షన్’ నటి డిమాండ్

  • Author Soma Sekhar Published - 07:32 PM, Mon - 28 August 23
  • Author Soma Sekhar Published - 07:32 PM, Mon - 28 August 23
నన్ను మోసం చేశాడు.. ఆ నేతను అరెస్ట్ చేయండి: ‘హనుమాన్ జంక్షన్’ నటి డిమాండ్

ప్రేమ పేరుతో మోసం చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నన్ను శారీరకంగా వాడుకుని, ఇప్పుడు బెదిరింపులకు గురించేస్తున్నాడు అంటూ నామ్ తమిళర్ కట్చి నేత, నటుడు, దర్శకుడు సీమన్ పై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది నటి విజయలక్ష్మి. అయితే ఆమె అతడిపై ఫిర్యాదు చేయడం ఇదే మెుదటిసారి కాదు. గతంలోనూ ఆమె సీమన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేను గతంలోనూ సీమన్ పై ఫిర్యాదు చేశాను, కానీ ఏళ్లు గడుస్తున్నా అతడిపై చర్యలు తీసుకోలేదు అంటూ మీడియా ముందు వాపోయింది.

విజయలక్ష్మి.. తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ సినిమాలో నటించింది. ఆ తర్వాత పూర్తిగా తమిళ సినిమాలకే పరిమితం అయ్యింది. తరచుగా వార్తల్లో నిలిచే విజయలక్ష్మి తాజాగా మరోసారి న్యూస్ లో నిలిచింది. నామ్ తమిళర్ నేత, నటుడు, దర్శకుడు సీమన్ తనను ప్రేమ పేరుతో వాడుకుని వదిలేశాడని, అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ..”నేను గతంలోనే సీమన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాను. 2007-09 వరకు సీమన్ నేను రిలేషన్ షిప్ లో ఉన్నాము. అయితే అప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. అతడు పెళ్లికి నిరాకరించాడు. నన్ను శారీరకంగా వాడుకుని, ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నాడు.

గతంలో నేను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈసారి నేను పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకున్నాను. అతడి అరెస్ట్ చేయండి” ఆవేదన వ్యక్తం చేసింది. కాగా.. విజయలక్ష్మిపై గతంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో.. 2020లో ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సోషల్ మీడియాలో సీమన్, పనన్ కట్టు పడైకి చెందిన హరి నాడార్ మద్దతురుల వేధింపులు ఎక్కువ అయ్యాయని, తన చావుకు కారణం అయినవాళ్లను వదిలిపెట్టొద్దంటూ ఓ వీడియోను అప్పట్లో పోస్ట్ చేసి మరీ సుసైడ్ కు ప్రయత్నించింది. తాజాగా మరోసారి అతడిపై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచింది.

ఇదికూడా చదవండి: షాకిచ్చిన దళపతి విజయ్ కొడుకు! హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకుంటే..

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Giriş