iDreamPost

వీడియో: మరీ ఇంత దారుణం ఏంటి.. నటిపై నెటిజన్ల ఫైర్‌!

ఈ మద్య ఏపీ, తమిళనాడులో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం కొనసాగించింది. భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం అతలాకుతలం అయ్యింది.. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

ఈ మద్య ఏపీ, తమిళనాడులో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం కొనసాగించింది. భారీ వర్షాల కారణంగా చెన్నై నగరం అతలాకుతలం అయ్యింది.. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

వీడియో: మరీ ఇంత దారుణం ఏంటి.. నటిపై నెటిజన్ల ఫైర్‌!

గతంతో తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఈ బాధ నుంచి కోలుకోక ముందే ఈ ఏడాది చివరన మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో చెన్నై నగరం అతలాకుతలం అయ్యింది. నైరుతీ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమేపీ మిచౌంగ్ తుఫాన్ గా ఏర్పడింది. దీని ప్రభావం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రంలో పడింది. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి.. తీవ్ర పంటనష్టం, ఆస్తి నష్టంతో పాలు పలు చోట్ల మరణాలు కూడా సంభవించాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ మునిగి చెరువులు, కుంటలను తలపించాయి. వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రజలు వరద కష్టాలతో నానా ఇబ్బందులు పడుతూ కన్నీరు పెట్టుకుంటున్న ఈ సమయంలో ఓ నటి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆ నటిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతగా విమర్శల పాలైన నటి ఏం చేసింది..? పూర్తి వివరాల్లోకి వెళితే..

మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ చెన్నై నగరంలో దారుణంగా పడింది. భారీ వర్షాలు చెన్నై నగరాన్ని ముంచేశాయి. జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ప్రస్తుతం వర్షాలు తగ్గినా.. చాలా ప్రాంతాల్లో వరద నీరు పూర్తిగా తొలగిపోలేదు. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా కష్టలు పడుతున్నారు. ఆహారం, కరెంట్, తాగు నీరు లేక అల్లాడిపోతున్నారు. ప్రజలను ఆదుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. మరోవైపు స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. అలాగే కొంతమంది సెలబ్రెటీలు తమవంతు సహాయాన్ని అందిస్తున్నారు. అంతేకాదు చెన్నై వాసులు కష్టాల్లో ఉన్నారు.. దయచేసి వారిని ఆదుకోవాలని… మీ వంతు సాయం చేయాలని స్వచ్ఛందగా మీడియా వేదికగా కోరుతున్నారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితిలో ఓ నటి వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

శివానీ నారాయణన్.. తమిళ బిగ్ బాస్ సీజన్ 4 లో తనదైన పర్ఫామెన్స్ తో అందరినీ బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ లో నటిస్తుంది. ఇటీవల కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ మూవీలో విజయ్ సేతుపతి భార్యగా నటించింది. తాజాగా శివానీ వర్షం నీటిలో హాట్ డ్రెస్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో పింక్ కలర్ టైట్ టీషర్ట్, బ్లూ కలర్ బాక్సర్ వేసుకొని వర్షం నీటిలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. దీనికి చెన్నై రేయిన్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ ని కూడా పెట్టింది. ఈ వీడియో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు నటి శివాని నారాయణన్ ని ఏకిపడేస్తున్నారు. చెన్నై లో ఉన్న పరిస్థితి ఏంటీ? ఓ దిక్కు ప్రజలు ఆకలి బాధలు తట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటే.. సాయం చేయాల్సింది పోయి.. ఎంజాయ్ కావాల్సి వచ్చిందా? దాన్ని వీడియో చేసి పాపులర్ అవ్వాలనుకుంటున్నావా?  అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shivani Narayanan (@shivani_narayanan)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి