iDreamPost

నన్ను లైంగికంగా వేధించాడు.. కారు డ్రైవర్‌పై బిగ్ బాస్ బ్యూటీ ఫిర్యాదు

బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది స్టార్ హోదాను సంపాదించారు. ఈ నటి కూడా అదే ఎంటర్ టైన్ మెంట్ షోలో పార్టిసిపేట్ చేసి.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ హిట్ మూవీలో కూడా నటించింది. కానీ ఆమెకు ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది.

బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది స్టార్ హోదాను సంపాదించారు. ఈ నటి కూడా అదే ఎంటర్ టైన్ మెంట్ షోలో పార్టిసిపేట్ చేసి.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ హిట్ మూవీలో కూడా నటించింది. కానీ ఆమెకు ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది.

నన్ను లైంగికంగా వేధించాడు.. కారు డ్రైవర్‌పై బిగ్ బాస్ బ్యూటీ ఫిర్యాదు

ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోయిన్స్ తామేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు. కష్టాన్ని ఇష్టంగా మలుచుకుని ఆ దిశగా పయనమవుతున్నారు. అయితే కొన్నిసార్లు చెప్పుకోలేని ఇబ్బందులు ఎదురవుతున్నా తట్టుకుని నిలబడుతుంటారు. కానీ వీరిని లైంగికపరమైన దాడులు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అవసరానికి పనిలో పెట్టుకుంటే.. వాళ్ల దగ్గర పనిచేస్తున్న వ్యక్తులే నీచానికి దిగబడుతున్నారు. ఇప్పుడు ఓ నటి ఇలాంటి చేదు అనుభవాన్నే చవిచూసింది. ఇటీవలే బిగ్ బాస్ లో మెరిసిన బ్యూటీ.. ఇప్పుడు ఓ వ్యక్తిపై కేసు పెట్టింది. తనను లైంగికంగా వేధించాడని, చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బెంగళూరుకు చెందిన మోడల్ కమ్ నటి షెరీనా తన కారు డ్రైవర్‌ పై కంప్లైంట్ చేసింది. ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌ గా పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది. తమిళంలో ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని తెరకెక్కించిన ‘వినోదయ సీతం’ మూవీలో కూడా నటించింది. ఈ మూవీ అక్కడ సూపర్ డూపర్ హిట్ (దీన్నే తెలుగులో బ్రో పేరుతో రీమేక్  చేశారు). ఈ క్రమంలో నటి షెరీనా సినిమా అవకాశాల కోసం చెన్నై రాయపేట జీబీ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‪లో నివాసం ఉంటుంది. అయితే ఆమె కారు డ్రైవర్‌ కార్తీక్ ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ.. ఇబ్బందికి గురి చేయడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా ఆమెను కార్తీక్, అతడి స్నేహితుడు ఇళయరాజా చంపేస్తామంటూ బెదిరించారు.

దీంతో షెరీనా మేనేజర్ గౌరీ జగన్నాథ్.. గత నెల 20న అన్నాసలై పోలీస్ స్టేషన్‌ లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న కార్తీక్, ఇళయరాజాలు తిరువళ్లూరు, విల్లుపురం జిల్లా వాసులుగా గుర్తించారు. ఎట్టకేలకు మైలాడుతురైలో అరెస్టు చేసి చెన్నైకి తీసుకు వచ్చి విచారించారు. కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా కార్తీక్‌ ను పనిలోంచి హీరోయిన్ షెరీనా తీసేసిందని.. ఇక అప్పటి నుంచి ఆమెపై కోపం పెంచుకున్నట్టు కార్తీక్ విచారణలో వెల్లడించాడు. తన స్నేహితుడు ఇళయరాజాతో కలిసి.. నటిని ఫోన్ లో లైంగికపరమైన వేధింపులకు పాల్పడటంతో పాటు చంపేస్తామంటూ బెదిరించామని ఒప్పుకున్నారు. పోలీసులు వీరిద్దరిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి