iDreamPost

తారల సెకండ్ ఇన్నింగ్స్ ఏం చెబుతున్నాయి

తారల సెకండ్ ఇన్నింగ్స్ ఏం చెబుతున్నాయి

హీరో హీరోయిన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు కొందరికి కెరీర్లో కొంత గ్యాప్ వస్తుంటుంది. అది కోరుకున్నది కావొచ్చు లేదా పరాజయాలు పలకరించడం వల్ల కావొచ్చు. కారణం ఏదైతేనేం ఇది అందరికి వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇటీవలి కాలంలో ఇలా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వారిని చూస్తే ఇది ఎలాంటి ఫలితం ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. మొదటగా 13 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన విజయశాంతి గురించి చెప్పుకోవాలి.

సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈవిడకు పాత్ర మంచిదే కానీ మరీ అభిమానులు ఊహించుకున్నంత గొప్పగా అయితే లేదు. ఉన్నంతలో విజయశాంతి స్క్రీన్ ప్రెజెన్స్ రిచ్ నెస్ తో పాటు హుందాతనం తేవడానికి ఉపయోగపడింది. మున్ముందు ఇలాంటి రోల్స్ మరిన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అల వైకుంఠపురములోతో వచ్చిన టబుకి సినిమా హిట్ అయినా పెద్ద ఉపయోగం కలిగేలా లేదు. ఒకటి రెండు సీన్లు తప్ప ఉనికిని చాటుకునే అవకాశం దొరకలేదు.

ఈ సినిమాలకే సంబంధించి మరో ఇద్దరి గురించి చెప్పుకోవాలి. కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి అగ్ర నిర్మాత స్థాయికి చేరుకున్న బండ్ల గణేష్ కు రెండు మూడు డిజాస్టర్లు పెద్ద షాక్ ఇచ్చాయి. దానికి తోడు రాజకీయాల్లోకి వెళ్ళాక కలిగిన డ్యామేజ్ ఆలోచనలో పడేలా చేసింది. దీంతో మహేష్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు. ట్రైన్ కామెడీలో కొద్దిసేపే వచ్చే ఈ పాత్ర తేలిపోయింది. ఇక అరవింద సమేతతోనే తన రెగ్యులర్ సపోర్టింగ్ రోల్స్ కు వచ్చిన సునీల్ కు అల వైకుంఠపురములో మరీ చిన్న పాత్ర దక్కింది. మొన్నటిదాకా హీరోగా చూసిన సునీల్ ఇప్పుడు చేస్తున్నవన్నీ కేవలం నెంబర్ కోసమే అనిపిస్తుంది. ఒకరకంగా చూస్తే వీళ్ళందరికీ సెకండ్ మరీ అద్భుత ఫలితాలను ఇవ్వలేదు. పోను పోను తర్వాత చేయబోయే సినిమాలు బ్రేక్ ఇస్తాయేమో చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి