iDreamPost

గ్లామర్ షో చేస్తే తప్పేంటి? నేను బోల్డ్ గానే ఉంటా: నటి హాట్ కామెంట్స్

  • Author Soma Sekhar Updated - 04:27 PM, Thu - 20 July 23
  • Author Soma Sekhar Updated - 04:27 PM, Thu - 20 July 23
గ్లామర్ షో చేస్తే తప్పేంటి? నేను బోల్డ్ గానే ఉంటా: నటి హాట్ కామెంట్స్

ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే కాస్తో కూస్తో అందాల ఆరబోత అనేది ఉండాలి. అయితే గ్లామర్ షోకు కొంత మంది హీరోయిన్స్ దూరమనే చెప్పాలి. కానీ మరికొంతమంది మాత్రం నేను స్కిన్ షోకు దూరం అంటూనే అందాలను ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. తాజాగా ఓ నటి అందాన్ని చూపించడం తప్పు కాదని, నాకు బోల్డ్ గా ఉండటమే ఇష్టమని హాట్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సినిమాలో చేస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన ఆ బోల్డ్ బ్యూటీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

సంజీదా షేక్.. హిందీ సీరియల్స్ లో పేరున్న నటి. అయితె బుల్లితెరపైనే ఈ భామ ఆగిపోలేదు. వెండితెరకు పరిచయం అయ్యి.. ఏకంగా హృతిక్ రోషన్ తోనే కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. స్వతహాగా సంజీదా మంచి డ్యాన్సర్. కెరీర్ తొలి రోజుల్లో డ్యాన్స్ లో షో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపుతో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో అవకాశాలు క్యూ కట్టాయి. కానీ అన్ని కథలు నచ్చక, బి గ్రేడ్, సీ గ్రేడ్ సినిమాలు చేయడం కన్నా హిందీలో సీరియల్స్ లో నటించడమే మంచిదని నిర్ణయించుకుందట ఈ బ్యూటీ. తాజాగా బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.

“గ్లామర్ షో చేయడం నా దృష్టిలో తప్పుకాదు. ఎవరేమనుకున్నా బోల్డ్ గా ఉండటం నాకిష్టం. అసలు నా కెరీర్ లో ఈ స్థాయికి వస్తానని ఎన్నడూ అనుకోలేదు. కయామత్ సీరియల్ లో నేను వేశ్య పాత్రలో నటించా. ఆ పాత్ర నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అక్కడి నుంచి నేను వెనుదిరిగి చూసుకోలేదు” అంటూ చెప్పుకొచ్చింది సంజీదా షేక్. నాచ్ బలియో 3 డ్యాన్స్ లో పాల్గొన్నప్పుడు తన డ్యాన్స్ పార్ట్ నర్ అమీర్ అలీతో ప్రేమలో పడింది. దాంతో వారిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత వారు విడాకులు కూడా తీసుకున్నారు. ఇక తాజాగా సంజీదా షేక్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మరి గ్లామర్ షో తప్పు కాదు అన్న సంజీదా షేక్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)


ఇదికూడా చదవండి: మంచో చెడో.. అంటూ బేబీ మూవీ సక్సెస్ పై విజయ్ దేవరకొండ కామెంట్స్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి