iDreamPost

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కళ్యాణ్ రామ్ హీరోయిన్! పోస్ట్ వైరల్..

  • Author Soma Sekhar Published - 02:40 PM, Thu - 6 July 23
  • Author Soma Sekhar Published - 02:40 PM, Thu - 6 July 23
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కళ్యాణ్ రామ్ హీరోయిన్! పోస్ట్ వైరల్..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో.. సెలబ్రిటీలు ఏ చిన్న విషయాన్ని అయినా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తమ సినిమా, పర్సనల్ లైఫ్ గురించిన విషయాలు, ఫొటోలు షేర్ చేస్తూ.. అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటున్నారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. వారికి పెళ్లి అయిన దగ్గర్నించి.. పిల్లలు పుట్టే వరకు ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ బుధవారం తాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు తన సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. సదరు నటి బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో నందమూరి కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ సరసన హీరోయిన్ గా నటించింది.

సనా ఖాన్.. 2005లో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ, వరుస సినిమాలతో అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో సైతం ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాల్లో నటించి అలరించింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘కత్తి’ సినిమాతో పాటుగా.. మంచు మనోజ్ నటించిన ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలోనూ మెరిసింది. టాలీవుడ్ తో పాటుగా కన్నడ, మలయాళ, తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసింది సనా ఖాన్. అయితే కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడే.. సినిమాలకు గుడ్ బై చెప్పి.. 2020లో అనాస్ సయ్యద్ ను వివాహం చేసుకుంది.

ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరం అయ్యింది సనా ఖాన్. కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తాజాగా తాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మీరందరు మాపై చూపుతున్న ప్రేమ కు థ్యాంక్స్. ఈ ప్రేమ మా బిడ్డకు కూడా కావాలని కోరుకుంటున్నాను అని అభిమానులను కోరింది. దాంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి