iDreamPost

43 ఏళ్ల వయసులో పెళ్లిపై నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 08:23 PM, Wed - 6 September 23
  • Author Soma Sekhar Published - 08:23 PM, Wed - 6 September 23
43 ఏళ్ల వయసులో పెళ్లిపై నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో వయసు పైబడుతున్నా గానీ కొంత మంది హీరోలు, హీరోయిన్ లు పెళ్లి గురించి ఊసెత్తరు. దానికి కారణం కెరీర్ లో ఇంకా పై స్థాయికి వెళ్లాలని, తమకు సరైన జోడీ ఇంకా దొరకడం లేదని వారు చెబుతుండటం మనం చూసే ఉన్నాం. మరికొంత మంది నటీ, నటులు వేర్వేరు కారణాలతో పెళ్లికి దూరంగా ఉన్నారు. తాజాగా 43 ఏళ్ల వయసులో పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీనియర్ హీరోయిన్ కౌసల్య. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈమె ప్రస్తుతం హీరో, హీరోయిన్ లకు తల్లి పాత్రలు చేస్తున్నారు.

నటి కౌసల్య.. ఏప్రిల్ 19 అనే మలయాళీ మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో కూడా పలు సినిమాలు చేసి.. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు కౌసల్య దగ్గరైయ్యారు. తెలుగులో అల్లుడుగారు వచ్చారు, పంచదార చిలక సినిమాల్లో హీరోయిన్ గా చేశారు కౌసల్య. ఈ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత వెండితెరకు కొంత గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌసల్య.. ఇప్పటి వరకు తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణాన్ని తెలియజేశారు.

కౌసల్య మాట్లాడుతూ..”పెళ్లంటే నాకు ఇష్టం లేక కాదు.. అదీకాక నేను పెళ్లికి వ్యతిరేకిని కూడా కాను. జీవితంలోకి సరైన వ్యక్తి అడుగుపెట్టినప్పుడు ఆ జీవితం కచ్చితంగా ఆనందంగా ఉంటుంది. ఇక మెుదట్లో నేను పెళ్లికి సెట్ కానని అనుకునేదాన్ని. నాకు సరైన వ్యక్తి దొరకడేమో అని కూడా అనుకునే దాన్ని. కానీ ఒకానొకదశలో నేను సరైన బంధం కోసం ఎదురుచూశాను. అది నాకు సెట్ కాలేదు. తల్లిదండ్రులతోనే ఉండాలని నిర్ణయించుకున్నా” అంటూ చెప్పుకొచ్చారు కౌసల్య. కాగా.. పెళ్లి తర్వాత అత్తమామలతో ఎలా ఉంటానోనని కంగారుపడినట్లు ఆమె తెలిపారు. దీంతో ఇలాంటి ఆలోచనలతో కొంతకాలం పాటు పెళ్లికి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు కౌసల్య. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురయ్యానని, దాంతో బరువు పెరిగానని తెలిపారు. ప్రస్తుతం మాత్రం ఆరోగ్యంగానే ఉన్నానని కౌసల్య చెప్పుకొచ్చారు. మరి అలనాటి హీరోయిన్ పెళ్లిపై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి