iDreamPost
android-app
ios-app

దర్శన్ కేసుపై స్పందించిన ఉపేంద్ర! మరోసారి మంచి మనిషి అనిపించుకున్నాడు!

Upendra Comments Darshan Case: కన్నడ హీరో దర్శన్ అరెస్ట్, ఆయన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు, అనంతరం దాని చుట్టూ జరుగుతున్న విచారణ పై కేవలం కర్ణాటక మాత్రమే కాదు.. యావత్ భారతదేశంలో సంచలనంగా మారింది. ఈకేసుపై హీరో ఉపేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.

Upendra Comments Darshan Case: కన్నడ హీరో దర్శన్ అరెస్ట్, ఆయన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు, అనంతరం దాని చుట్టూ జరుగుతున్న విచారణ పై కేవలం కర్ణాటక మాత్రమే కాదు.. యావత్ భారతదేశంలో సంచలనంగా మారింది. ఈకేసుపై హీరో ఉపేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.

దర్శన్ కేసుపై స్పందించిన ఉపేంద్ర! మరోసారి మంచి మనిషి అనిపించుకున్నాడు!

కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కేసులు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ , ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ అరెస్టు అయ్యారు. ఇక రేణుకా స్వామి హత్య కేసు కన్నడ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. దర్శన్ ప్రియురాలి కోసం అభిమానినే హత్య చేయిండాని తేలడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలోనే దర్శన్ కి మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు స్పందిస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఈ ఘటనపై స్పందించారు. అలానే ఘటన జరిగిన వారం తరువాత తాజాగా ఉపేంద్ర స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి.. ఆయన చేసిన కామెంట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కన్నడ హీరో దర్శన్ అరెస్ట్, ఆయన అభిమాని రేణుకాస్వామి హత్య కేసు, అనంతరం దాని చుట్టూ జరుగుతున్న విచారణ పై కేవలం కర్ణాటక మాత్రమే కాదు.. యావత్ భారతదేశంలో సంచలనంగా మారింది. ఈ కేసులో సెలబ్రిటీలే నిందితులుగా ఉండటంతో.. ఈ కేసు విచారణలో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలానే ఎలాంటి న్యాయం జరుగుతుందా అని అందరూ వేచి చూస్తున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. దర్శన్ అరెస్ట్ జరిగిన వారం తర్వాత ఈ ఘటనపై నటుడు ఉపేంద్ర తన అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

ఇక దర్శన్ కేసుపై ఉపేంద్ర స్పందిస్తూ..  రేణుకా స్వామి కుటుంబం, ప్రజలు, దర్శన్ ఫ్యాన్.. ఇలా అందరిలో కొంత ఆందోళన, అనుమానాలు, ఊహాగానాలు ఉన్నాయని తెలిపారు. ఏదేమైనప్పటికీ కేసు విచారణకు సంబందించిన వీడియో రికార్డులు, సాక్షుల వివరాలన్నింటినీ పోలీసులు ఎప్పటికప్పుడు సంబంధిత వ్యక్తుల కుటుంబాలతో పంచుకోవాలని తెలిపారు. అంతేకాక అలా చేయడం చట్టంగా మారాలని పేర్కొన్నారు. గతంలో పోలీసులు విచారణకు సంబంధించిన వివరాలను రాసి నమోదు చేసేవారని, కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ క్రమంలోనే  ప్రతి విషయాన్ని వీడియో రికార్డు చేసి లైవ్ స్ట్రీమింగ్ చేసేలా న్యాయ సంస్కరణలు జరగాలని ఉప్రేంద్ర చెప్పుకొచ్చారు.

అలాగే సెలబ్రిటీల మీద కేసు ఉంటే.. అందుకు సంబంధించిన విచారణ వీడియో రికార్డులు, సాక్షుల వివరాలను  పోలీసులు బహిరంగపరచాలంటూ ఉపేంద్ర పోస్టు చేశారు. పబ్లిక్ ఫిగర్ విచారణ పూర్తి పారదర్శకతతో బహిరంగంగా జరగాలని, అప్పుడే సాక్ష్యాలను ధ్వంసం కావడం, తారుమారు కావడం, అలానే పెద్ద పెద్ద వ్యక్తుల జోక్యం, అవినీతి వంటి వాటికి అడ్డుకట్ట పడుతుందని ఉపేంద్ర అన్నారు. అదే విధంగా ఈ కేసు విషయంలో న్యాయం కోసం ఎదురు చూసే వారందరికి అయోమయం లేకుండా గౌరవం పెరుగుతుందని ఉపేంద్ర అన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పై కామెంట్స్ ను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.